Perth Test : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఇద్దరు డకౌట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

By Medi Samrat  Published on  22 Nov 2024 9:03 AM IST
Perth Test : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఇద్దరు డకౌట్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పేసర్ హర్షిత్ రాణా, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి భారత్ తరఫున అరంగేట్రం చేశారు. ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ అరంగేట్రం చేశాడు. అయితే భారత బ్యాటర్లకు ఆసీస్ పేసర్లు ఆదిలోనే షాక్ ఇచ్చారు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న యశస్వి డకౌట్ అయ్యాడు. ఇక దేవదత్ పడిక్కల్ కూడా డకౌట్ అయ్యాడు.

భారత్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.

Next Story