టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత మెన్స్ జట్టు ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.

By Medi Samrat  Published on  1 Jun 2024 7:55 PM IST
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత మెన్స్ జట్టు ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తలపడనుంది. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్ లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ను లీగ్ మ్యాచ్ లు ఆరంభానికి ముందు ఉపయోగించుకోవాలని భారత జట్టు భావిస్తోంది.

భారత్ (బ్యాటింగ్ 11, ఫీల్డింగ్ 11): రోహిత్ శర్మ(సి), యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(w), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ , అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

బంగ్లాదేశ్ (బ్యాటింగ్ 11, ఫీల్డింగ్ 11): లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ(w), మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, షోరీఫుల్ ఇస్లాం, తాంజిద్ హసన్, తాంజిద్ హసన్ హసన్ సాకిబ్, తన్వీర్ ఇస్లాం

Next Story