శ్రీలంక పర్యటనకు భారత్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

ఈ నెలాఖరులోనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.

By Srikanth Gundamalla  Published on  11 July 2024 8:45 PM IST
team india, sri lanka,  t20, odi, cricket,

శ్రీలంక పర్యటనకు భారత్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచింది. ఆ తర్వాత సీనియర్‌ ప్లేయర్లు దాదాపుగా రెస్ట్‌ తీసుకుంటున్నారు. ఇప్పుడు యంగ్‌ ఇండియా టైమ్‌ వచ్చింది. ప్రస్తుతం గిల్‌ నేతృత్వంలోని టీమ్‌ జింబాబ్వే పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో ఐదు టీ20 మ్యాచ్‌ల సరీస్‌ ఆడుతోంది. కాగా.. ఈ సిరీస్‌ జూలై 14వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఈ నెలాఖరులోనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.

లంక పర్యటనలో భాగంగా ఆ టీమ్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనున్నట్లు తెలిపారు. ఈ టూర్‌కు సంబంధించిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. టీ20 మ్యాచులు అన్నీ పల్లెకెలెలో సాయంత్రం 7 గంటలకు, వన్డే మ్యాచ్‌లు కొలంబోలో మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభంకానున్నాయి. బీసీసీఐ త్వరలోనే జట్టును ప్రకటించనుంది. భారత్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ ప్రయాణం ఈ సిరీస్‌తోనే ప్రారంభంకానుంది.

టీ20 మ్యాచ్‌లు:

జులై 26న తొలి టీ20

జులై 27న రెండో టీ20

జులై 29న- మూడో టీ20

వన్డే మ్యాచ్‌లు:

ఆగస్టు 1న మొదటి వన్డే

ఆగస్టు 4న రెండో వన్డే

ఆగస్టు 7న మూడో వన్డే

Next Story