హిట్‌మ్యాన్ వ‌చ్చేశాడు.. విండీస్‌తో పోరుకు భార‌త జ‌ట్ల ఎంపిక‌

Team India Squad For West Indies Series 2022.స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో జ‌రిగే ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌ల‌లో పాల్గొనే భార‌త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2022 2:54 AM GMT
హిట్‌మ్యాన్ వ‌చ్చేశాడు.. విండీస్‌తో పోరుకు భార‌త జ‌ట్ల ఎంపిక‌

స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో జ‌రిగే ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌ల‌లో పాల్గొనే భార‌త జ‌ట్టును సెల‌క్ష‌న్ క‌మిటీ బుధ‌వారం ప్ర‌క‌టించింది. గాయం కార‌ణంగా ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు దూర‌మైన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫిట్‌నెస్ ప‌రీక్షలో పాస్‌కావ‌డంతో వెస్టిండీస్ సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు చేప‌ట్ట‌నున్నాడు. స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ వ‌న్డేల్లో చోటు దక్కించుకోగా.. 21 ఏళ్ల లెగ్‌స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్ తొలిసారి టీ20 సిరీస్‌కు ఎంపిక‌య్యాడు. హార్ట్ హిట్ట‌ర్ దీప‌క్ హుడా కు వ‌న్డే జ‌ట్టులో చోటు ద‌క్కింది. ఇక గాయం నుంచి ఇంకా కోలుకోక‌పోవ‌డంతో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను సెల‌క్ష‌న్ క‌మిటీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. ఇక సీనియ‌ర్ బౌల‌ర్లు బుమ్రా, ష‌మిల‌కు విశ్రాంతి నివ్వ‌గా.. భువ‌నేశ్వ‌ర్‌కు టీ20 జ‌ట్టులో మాత్ర‌మే చోటు ద‌క్కింది. ఇక మ‌రోసారి ప‌రిమిత ఓవ‌ర్ల జ‌ట్టులో అశ్విన్ చోటు కోల్పోయాడు.

వెస్టిండీస్‌తో భార‌త జ‌ట్టు మూడు వ‌న్డేలు, మూడు టీ20లు ఆడ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 6 నుంచి వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. వ‌న్డేలు ఫిబ్ర‌వ‌రి 6, 9, 11 తేదీల్లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ మూడు వ‌న్డేల‌కు అహ్మ‌దాబాద్ వేదిక కానుండ‌గా.. టీ20ల‌కు కోల్‌క‌తా అతిథ్యం ఇవ్వ‌నుంది. టీ20లు ఫిబ్ర‌వ‌రి 16,18, 20న జ‌ర‌గ‌నున్నాయి.

టీమ్ఇండియా వన్డే జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్‌), కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శిఖ‌ర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్‌ పంత్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్

టీమ్ఇండియా టీ20 జట్టు: రోహిత్(కెప్టెన్‌), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాద‌వ్‌, రిష‌బ్ పంత్, వెంకటేశ్ అయ్య‌ర్‌, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, య‌జ్వేంద్ర చాహల్, వాషింగ్ట‌న్ సుందర్, మ‌హ‌మ్మ‌ద్‌ సిరాజ్, భువనేశ్వర్ కుమార్‌, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్

Next Story
Share it