టీ20 కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవాలి.. రోహిత్‌ను బతిమాలుతున్న బీసీసీఐ

ప్రస్తుతం టీమిండియా భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సరీస్ ఆడుతోంది.

By Srikanth Gundamalla  Published on  30 Nov 2023 11:05 AM GMT
team india, south africa , cricket, rohit,  bcci,

టీ20 కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవాలి.. రోహిత్‌ను బతిమాలుతున్న బీసీసీఐ

ప్రస్తుతం టీమిండియా భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సరీస్ ఆడుతోంది. ఇప్పటికే మూడు మ్యచ్‌లు అయిపోగా.. 2-1 తేడాతో ఇండియా ఆధిక్యంలో ఉంది. అయితే.. మరో రెండు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లనుంది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే.. సఫారిలతో తలపడేందుకు జట్టును కూడా ప్రకటించేందుకు బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మను టీ20 సిరీస్‌లో ఆడించాలని ప్రయత్నాలు చేస్తోంది.

గతేడాది టీ20 వరల్డ్‌ కప్‌ ఓటమి తర్వాత ఈ ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. తాజాగా వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఓటమి తర్వాత రోహిత్‌ శర్మ రెస్ట్‌ తీసుకుంటున్నారు. సౌతాఫ్రికాతో జరిగే వైట్‌ బాల్‌ సిరీస్‌కు దూరంగా ఉండాలని కూడా అతను అనుకున్నాడట. విరాట్‌ కూడా ఈ దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. రోహిత్‌ శర్మ అందుబాటులో లేకపోతే సాధారణంగా ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యా టీ20లు, వన్డే జట్టులకు కెప్టెన్‌గా ఉంటాడు. కానీ.. అతను వరల్డ్‌ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడి ఇంకా కోలుకోలేదు. చికిత్స తీసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా టూర్ సమయానికి కూడా రికవరీ అవుతారనేది అనుమానమే.

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రోహిత్, కోహ్లీ, పాండ్యా ముగ్గురూ ఆడటం లేదు. సూర్యకుమార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో కూడా రోహిత్‌ శర్మ రాకపోతే అతనే కెప్టెన్సీ నిర్వహిస్తాడని సమాచారం. అయితే.. దక్షిణాఫ్రికా గడ్డపై కెప్టెన్సీ అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే సీనియర్ ప్లేయర్ రోహిత్ వర్మను ఎలాగైనా ఒప్పించి.. టీ20 జట్టుకు కెప్టెన్ ఎంపిక చేయాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోందట. కోహ్లీ మాత్రం టీ20, వన్డేలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసేసుకున్నాడనీ.. బీసీసీఐ కి కూడా ఈవిషయం తెగేసి చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా టూర్‌కు భారత జట్టులో ఎవరెవరు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.

Next Story