అటు విన‌య్‌.. ఇటు యూస‌ఫ్.. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇద్ద‌రు గుడ్ బై

Team India pacer Vinay Kumar announced retirement.టీమ్ఇండియా సీనియ‌ర్ బౌల‌ర్, క‌ర్ణాట‌క రంజీ ఆట‌గాడు విన‌య్‌కుమార్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2021 11:39 AM GMT
అటు విన‌య్‌.. ఇటు యూస‌ఫ్.. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇద్ద‌రు గుడ్ బై

టీమ్ఇండియా సీనియ‌ర్ బౌల‌ర్, క‌ర్ణాట‌క రంజీ ఆట‌గాడు విన‌య్‌కుమార్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌తో పాటు అన్ని ర‌కాల ఫార్మాట్లకు రిటైర్‌మెంట్లు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు శుక్ర‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. భావోద్వేగ‌పు పోస్టు చేశాడు. 'రిటైర్మెంట్‌ అనే పదం వినడానికి బాధగా ఉన్నా.. ప్రతీ ఒక్కరు ఏదో ఒక దశలో కెరీర్‌కు గుడ్‌బై చెప్పాల్సిందే. నా రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఈరోజుతో నా ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు ముగింపు పలుకుతున్నా. భార‌త్‌ తరపున అంతర్జాతీయ జట్టుకు ఆడడం నా గౌరవంగా భావిస్తున్నా. అనిల్ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్‌, ఎంఎస్‌ ధోని, గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లి, సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ లాంటి ఆటగాళ్లతో ఆడడం నా అదృష్టం. ఇన్నాళ్లు మీరిచ్చిన మద్దతుకు నా ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశాడు.


2010లో అరంగ్రేటం చేసిన విన‌య్‌కుమార్‌. టీమ్ఇండియా త‌రుపున 31 వన్డేల్లో 38 వికెట్లు, 9 టీ20ల్లో 10 వికెట్లతో పాటు ఒక్క టెస్టు మ్యాచ్‌ ఆడి ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో 105 మ్యాచ్‌లు ఆడి 105 వికెట్లు ప‌డ‌గొట్టాడు. విన‌య్ కుమార్ కెప్టెన్సీలోనే కర్ణాటక జట్టు 2013-14, 2014-15 రంజీ ట్రోపీ టైటిల్స్‌ను సాధించింది.


భారత ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్, 38 ఏళ్ల వయసులో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్లకు శుక్రవారం గుడ్‌ బై ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్ల‌డించారు. ఇంతకాలం త‌న వెన్నంటి నిలిచిన కుటుంబ సభ్యులకు, స్పేహితులకు, అభిమానులకు, కోచ్‌లకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ప‌ఠాన్‌.. టీమిండియా తరపున 57 వన్డేల్లో 810 పరుగులు, 22 టీ20ల్లో 232 పరుగులు చేశాడు. వన్డేల్లో 2 సెంచరీలు, 5 అర్థ సెంచరీలు చేశాడు. 2012 తర్వాత మళ్లీ టీమ్ఇండియా త‌రుపున ఆడ‌లేక‌పోయాడు.






Next Story