Team India New Jersey For Australia Tour. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ముగిసింది. ఆస్త్రేలియా సిరీస్ కోసం భారత
By Medi Samrat Published on 12 Nov 2020 3:02 PM GMT
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ముగిసింది. ఆస్త్రేలియా సిరీస్ కోసం భారత క్రికెటర్లు దుబాయ్ నుంచే ఆసీస్ ప్లైట్ ఎక్కారు. కరోనా మహమ్మారి తరువాత టీమ్ఇండియా ఆడే తొలి సిరీస్ ఇదే. దాదాపు మూడు నెలలు సాగే ఈ సుదీర్ఘ పర్యటనలో భారత జట్టు ఆసీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.
ఇక ఈ పర్యటనలో భారత జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న నీలం రంగు బదులు నేవీ బ్లూకు మారనుంది. ఇది 1992 ప్రపంచకప్ రెట్రో జెర్సీల్లా దర్శనమిస్తున్నాయి. ఈ జెర్సీ ని బీసీసీఐ(భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ) ఆవిష్కరించింది. పాత తరం క్రికెటర్లను గుర్తుకు తీసుకొచ్చేలా ఈ జెర్సీని డిజైన్ చేశారు. భుజాల వద్ద తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు వరుసలు ఉంటాయి. ప్రస్తుతం ఈ జెర్సీకి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెటర్లందరూ వాటిని ధరించి ఫోటోలు తీసుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటికే భారత జట్టు ఆసీస్‌తో తలపడే జట్టును ప్రకటించగా.. ఆసీస్ నేడు టీమ్ఇండియాతో తలపడే టెస్టు జట్టును ప్రకటించింది.