టీ20 వరల్డ్ కప్ విజేతలకు ప్రధాని మోదీ ఆతిథ్యం
టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇక్కడ తన 7వ లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.
By అంజి Published on 4 July 2024 2:44 PM ISTటీ20 వరల్డ్ కప్ విజేతలకు ప్రధాని మోదీ ఆతిథ్యం
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇక్కడ తన 7వ లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. జట్టులోని ప్రతి సభ్యుడితో ప్రధాని మోదీ సంభాషించారు. వారి అద్భుతమైన విజయం పట్ల వారిని అభినందించారు. ప్రధాని మోదీకి రోహిత్ శర్మ ట్రోఫీని అందజేయగా, టీమ్ అంతా ఫోటోకి ఫోజులిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షా కూడా పాల్గొన్నారు. టీ20 ప్రపంచ కప్ విజయం భవిష్యత్ టోర్నమెంట్‌లలో బాగా ఆడేందుకు ఇతర ఆటగాళ్లకి ప్రేరణనిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
మెన్ ఇన్ బ్లూ ఇప్పుడు ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్లడానికి విమానాశ్రయానికి తిరిగి వెళ్తోంది. ముంబై విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత జట్టు వాంఖడే స్టేడియంకు చేరుకుంటుంది. బీసీసీఐ నారిమన్ పాయింట్ నుండి వాంఖడే వరకు 1 కి.మీ విజయ పరేడ్‌ని ఏర్పాటు చేసింది. తర్వాత వాంఖడే స్టేడియంలో ఒక చిన్న వేడుక జరగనుంది. ముంబైలోని ఐకానిక్ వేదికగా శనివారం దక్షిణాఫ్రికాతో ఫైనల్‌కు బార్బడోస్‌కు హాజరైన బీసీసీఐ సెక్రటరీ జే షా, దశాబ్దకాలం తర్వాత తమ తొలి ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నారు.
అంతకుముందు టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు చెందిన హీరోలు గురువారం ఇంటికి తిరిగి వచ్చారు. భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఏర్పాటు చేసిన ప్రత్యేక చార్టర్ విమానంలో బృందం, సహాయక సిబ్బంది సభ్యులు ,దాదాపు 20 మంది మీడియా సభ్యులు న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. సెక్రటరీ జే షా కూడా ఎయిర్ ఇండియా విమానంలో బృందంతో కలిసి ప్రయాణించారు. బెరిల్ హరికేన్ దెబ్బకు బార్బడోస్‌లో మూడు రోజులుగా చిక్కుకుపోయిన ప్రపంచకప్ హీరోలను ఇంటికి తీసుకురావడానికి బిసిసిఐ చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.