టీ20ల్లో హాఫ్‌ సెంచరీలు అవసరం లేదు..అలా చేస్తే చాలు: రోహిత్

టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ జట్టు జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకెళ్తుంది.

By Srikanth Gundamalla  Published on  23 Jun 2024 9:00 AM IST
team india, cricket, captain, rohit sharma,   hardik,

టీ20ల్లో హాఫ్‌ సెంచరీలు అవసరం లేదు..అలా చేస్తే చాలు: రోహిత్

టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ జట్టు జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకెళ్తుంది. సూపర్‌-8లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడింది. ఈ మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్‌ సెమీ ఫైనల్‌ బెర్త్‌ను దాదాపు కన్ఫామ్ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 196 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా రాణించి 146 పరుగులకే కట్టడి చేసింది.

అయితే.. బంగ్లాతో విజయంలో వైస్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ చేసిన హార్దిక్.. బౌలింగ్‌లో కీలక వికెట్‌ను తీశాడు. కుల్దీప్‌ యాదవ్ 3, బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక కామెంట్స్ చేశాడు.

టీ20 మ్యాచుల్లో దూకుడుగా ఆడాలని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఎట్టకేలకు తాము అనుకున్నది చేశామని అన్నాడు. అన్ని విభాగాల్లో సత్తా చాటామని చెప్పాడు. ఓవారాల్‌గా టీమ్ ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానని రోహిత్ చెప్పాడు. ఏది ఏమైనా జట్టులోని 8 మంది బ్యాటర్లు తమ పాత్ర షోషించాలన్నాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క ప్లేయర్ హాఫ్‌ సెంచరీ చేసినప్పటికి తాము 197 పరుగులు చేశానీ.. టీ20ల్లో భారీ స్కోర్ సాధించాలంటే హాఫ్ సెంచరీలు, సెంచరీలు అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. జట్టులో ప్రతి ఒక్కరూ సమిష్టిగా రాణిస్తే అదే విజయాన్ని అందిస్తుందని రోహిత్ పేర్కొన్నాడు. బ్యాటర్లు రాణించి ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తెస్తే చాలని పేర్కొన్నాడు.

ఇక హార్దిక్ బ్యాట్‌తో రాణించడం ఎంత ముఖ్యమో అఫ్గాన్‌తో మ్యాచ్ అనంతరం కూడా చెప్పానని కెప్టెన్ రోహిత్‌ గుర్తు చేశాడు. అతని బ్యాటింగ్ తమను పటిష్ట స్థితిలో ఉంచుతుందని చెప్పాడు. హార్దిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనీ.. అతడి సత్తా ఏంటో తమకు బాగా తెలుసన్నాడు. అతను జట్టుకు ముఖ్యమైన ఆటగాడని రోహిత్ శర్మ చెప్పాడు. పాండ్యా ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే రాబోయే మ్యాచుల్లో విజయాలు సులభం అవుతాయని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.

Next Story