ఐపీఎల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. క్రికెట్ లీగ్ లలోనే ఒక బ్రాండ్ గా మారిపోయింది.

By Medi Samrat  Published on  20 Jan 2024 11:15 AM GMT
ఐపీఎల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. క్రికెట్ లీగ్ లలోనే ఒక బ్రాండ్ గా మారిపోయింది. తాజాగా ఐపీఎల్ కు కొత్త స్పాన్సర్ వచ్చినట్టు బీసీసీఐ వెల్లడించింది. టాటా గ్రూప్ ఐపీఎల్ కు మరో ఐదేళ్ల పాటు స్పాన్సర్ గా వ్యవహరించనున్నట్టు ఓ ప్రకటనలో బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్ తో ఒప్పందం 2024 సీజన్ నుంచి 2028 సీజన్ వరకు వర్తిస్తుందని.. ఐపీఎల్ చరిత్రలో ఎన్న‌డూ లేని విధంగా రూ.2,500 కోట్లతో స్పాన్సర్ షిప్ హక్కులను టాటా గ్రూప్ చేజిక్కించుకున్నట్టు బీసీసీఐ పేర్కొంది. టాటా గ్రూప్ గతంలోనూ ఐపీఎల్ స్పాన్సర్ గా వ్యవహరించింది. 2022, 2023 సీజన్లకు టాటా గ్రూప్ ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించింది. మహిళల టీ20 లీగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కు టైటిల్ స్పాన్సర్ గా టాటా సంస్థ వ్యవహరిస్తూ ఉంది.

ఇక ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఇటీవల కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. మే మధ్యలో సీజన్ ముగిసేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్టు సమాచారం. జూన్ నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించి, ముగించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి బీసీసీఐ కార్యదర్శి జైషా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఐపీఎల్ షెడ్యూల్ కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Next Story