తాలిబాన్లు క్రికెట్ కు మద్దతేనట..!

Taliban Meet Afghan Cricket Team in Kabul. ఆఫ్ఘనిస్తాన్‌ ను తాలిబన్లు తమ నియంత్రణలోకి తీసుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌పై

By Medi Samrat  Published on  23 Aug 2021 9:01 AM GMT
తాలిబాన్లు క్రికెట్ కు మద్దతేనట..!

ఆఫ్ఘనిస్తాన్‌ ను తాలిబన్లు తమ నియంత్రణలోకి తీసుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌పై కూడా ప్రభావం చూపుతుందని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. క్రికెట్ జట్టులో తాము ఏ విధంగానూ జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు తాలిబాన్లు. తాలిబాన్ సీనియర్ అధికారి ఆఫ్ఘన్ క్రికెటర్లతో ప్రత్యకంగా సమావేశమయ్యారు. అతను దేశ క్రికెట్‌కు పూర్తిగా మద్దతు ఇస్తారని చెప్పారు. తాలిబాన్ నాయకుడు అనాస్ హక్కానీ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది, మాజీ క్రికెట్ బోర్డు అధికారులు అసదుల్లా, నూర్ అలీ జద్రాన్‌లను కలిశారు. 1996 నుండి 2001 వరకు అతని అధ్యక్షతనే దేశంలో క్రికెట్ ప్రారంభమైంది. మేము ఎల్లప్పుడూ క్రికెట్‌కు మద్దతు ఇస్తున్నామని తాలిబాన్లు తెలిపారు. దేశ క్రికెటర్లకు తాలిబాన్లు మద్దతు ఉంటుందని హక్కానీ అన్నారు. వారి సమస్యలకు అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటాము. ఈ సందర్భంగా హాజరైన క్రికెటర్లు హక్కానీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు వచ్చే నెలలో పాకిస్థాన్‌తో వన్డే సిరీస్, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సిరీస్ కోసం, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళు రోడ్డు మార్గంలో పాకిస్తాన్ వెళ్తారు. అక్కడి నుంచి జట్టు యూఏఈ ద్వారా శ్రీలంక చేరుకుంటుంది. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో భాగం. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. ఆఫ్ఘనిస్తాన్ లోని నంగర్‌హార్ ప్రావిన్స్‌ని పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌తో కలిపే సరిహద్దు తుర్ఖామ్.. కాబూల్ నుంచి తుర్కామ్ సరిహద్దు మీదుగా పెషావర్ వెళ్లే డ్రైవ్ మూడున్నర గంటలు. ఈ బృందం పెషావర్ నుంచి ఇస్లామాబాద్, అక్కడ నుంచి యూఏఈకి వెళ్తుంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు యూఏఈ నుంచి కొలంబోకు వెళ్తుంది.


Next Story