యువరాజ్ ఎంత మంచి గురువో ఈ వీడియో చూస్తే అర్ధ‌మ‌వుతుంది..!

అభిషేక్ శర్మ పుట్టినరోజు సందర్భంగా అతని గురువు యువరాజ్ సింగ్ ఒక వీడియోను షేర్ చేశాడు.

By Medi Samrat  Published on  4 Sept 2024 8:13 PM IST
యువరాజ్ ఎంత మంచి గురువో ఈ వీడియో చూస్తే అర్ధ‌మ‌వుతుంది..!

అభిషేక్ శర్మ పుట్టినరోజు సందర్భంగా అతని గురువు యువరాజ్ సింగ్ ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మకు ఓ ప్రత్యేకమైన‌ సలహా ఇస్తున్నాడు. యువరాజ్ సింగ్ నెట్స్‌లో అభిషేక్ శర్మను ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే 'నువ్వు బాగుపడవు.. సిక్సర్లు కొడితే చాలా' అని చెప్ప‌డం చూడ‌వ‌చ్చు.

యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మకు ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. భారత జెర్సీలోనూ అభిషేక్ శర్మ తన మ్యాజిక్‌ను చాటాడు. అయితే.. అభిషేక్ శర్మ నుండి అతని గురువు యువరాజ్ సింగ్ ఇంకా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఆశిస్తున్నాడు.

యువరాజ్ సింగ్ అభిషేక్ శర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోను విడుదల చేశాడు. యువరాజ్ సింగ్ షేర్ చేసిన వీడియోలో.. అతను అభిషేక్‌కు శిక్షణ ఇస్తున్నట్లు కనిపించాడు. శిక్షణ సమయంలో అభిషేక్ ఒకదాని తర్వాత ఒకటి భారీ షాట్లు ఆడుతుంటాడు.

యువరాజ్ సింగ్ అభిషేక్ షాట్‌లను చూసి.. 'సింగిల్స్‌ కూడా తీయాలి మహారాజ్' అని చెప్పాడు. వీడియోలో అభిషేక్‌ను స్వీప్ షాట్ ఆడ‌మ‌ని సూచించాడు. ఆ త‌ర్వాత కొన్ని షాట్లు ఆడతాడు. వీడియో చివర్లో.. 'నువ్వు మెరుగుపడవు.. తగ్గకుండా.. సిక్సర్లు కొడుతూనే ఉంటే' అని యువరాజ్ చెప్ప‌డం వినొచ్చు.

యువరాజ్ వీడియో క్యాప్షన్‌లో.. 'అభిషేక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీవు సింగిల్స్ తీస్తావ‌ని నేను ఆశిస్తున్నాను. కష్టపడు.. ముందుంది మంచి కాలం అంటూ రాశాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. మంచి గురువు దొరికిన అభిషేక్ శర్మ అదృష్ట‌వంతుడ‌ని కామెంట్లు చేస్తున్నాయి.

Next Story