T20 World Cup: వెస్టిండీస్ ఔట్.. సెమీస్‌కు సౌతాఫ్రికా
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో చాలా ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లు జరిగాయి.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 7:00 AM GMTT20 World Cup: వెస్టిండీస్ ఔట్.. సెమీస్‌కు సౌతాఫ్రికా
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో చాలా ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లు జరిగాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల తర్వాత సెమీస్ కోసం సూపర్-8 మ్యాచ్‌లు జరగుతున్నాయి. ఈక్రమంలోనే గ్రూప్-2లో సెమీస్ చేరే జట్లు ఏవో ఇప్పుడు తేలిపోయింది. అమెరికాను చిత్తు చేసి టోర్నీలో సెమీ ఫైనల్ చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఇక మరో బెర్త్‌ను సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. వర్చువల్ నాకౌట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను సౌతాఫ్రికా మూడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఆ తర్వాత డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 17 ఓవర్లలో 123 టార్గెట్‌ను సవరించారు. ఈ క్రమంలోనే మరో 5 బంతులు ఉండగానే సౌతాఫ్రికా చేధించింది. తద్వారా సెమీస్‌కు దూసుకెళ్లింది.
మందకొడి పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అనుకున్నని పరుగులు సాధించలేదు. రోస్టన్ చేజ్ 42 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో షంసీ మూడు వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా చేజ్‌క దిగి మొదటి రెండు ఓవర్లలో 15 పరుగులు చేసి రెండు వికెట్లను కోల్పోయింది. అయితే.. అప్పుడే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అంతేకాక.. ఓవర్లను కూడా కుదించారు. దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 136 పరుగుల నుంచి 17 ఓవర్లకు 124 పరుగులుగా నిర్ణయించారు. స్లోపిచ్‌పై ప్రతి పరుగూ కీలకమే. కానీ వరుణుడు రాకతో సౌతాఫ్రికాకు మూడు ఓవర్లతో పాటు 12 పరుగుల టార్గెట్ తగ్గింది. దీన్ని అయిదు బంతులు (16.1 ఓవర్లలో) మిగిలుండగా సౌతాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే దక్షిణాఫ్రికా ఛేజింగ్ అంత ఈజీగా సాగలేదు. ఆఖర్లో ఉత్కంఠగా కొనసాగింది. చివరకు వెస్టిండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. సౌతాఫ్రికా సెమీస్ ఆడబోతుంది.