T20 వరల్డ్ కప్: పాకిస్థాన్‌ను ఇంటికి పంపించేస్తున్న వరుణుడు
ఐర్లాండ్‌తో ఆడే మ్యాచ్‌లో గెలిచి.. అదృష్టం ద్వారా సూపర్-8కి చేరాలనుకున్నా పాక్ ఆశలు ఆవిరయిపోయాయి.
By Srikanth Gundamalla Published on 15 Jun 2024 3:05 PM ISTT20 వరల్డ్ కప్: పాకిస్థాన్‌ను ఇంటికి పంపించేస్తున్న వరుణుడు
టీ20 వరల్డ్ కప్ టోర్నీ పాకిస్థాన్‌కు కలిసిరాలేదు.ఐర్లాండ్‌తో ఆడే మ్యాచ్‌లో గెలిచి.. అదృష్టం ద్వారా సూపర్-8కి చేరాలనుకున్నా పాక్ ఆశలు ఆవిరయిపోయాయి. శుక్రవారం ఫ్లోరిడాలోని లాడర్‌హిల్ స్టేడియంలో జరగాల్సిన అమెరికా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. దాంతో మ్యాచ్ ఆగిపోయింది. రెండు టీమ్‌లకు చెరో పాయింట్ ఇచ్చారు. ఈ మ్యాచ్ ఎఫెక్ట్ పాకిస్థాన్‌పై పడింది. వరుణు ఆ మ్యాచ్‌కు అడ్డుపడటం.. చెరోపాయింట్ లభించడంతో పాకిస్థాన్‌కు ఇంటిబాట పట్టాల్సి వస్తోంది.
ఫ్లోరిడాలో గత కొద్దిరోజులుగా ప్రతికూల వాతావరణం కనిపించింది. భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అక్కడ జరగాల్సిన మ్యాచ్‌ల నిర్వహణపై సందిగ్ధత కొనసాగింది. అనుకున్నట్లుగానే ఐర్లాండ్, అమెరికా మ్యాచ్‌కు వరుణుడు బ్రేక్ వేశాడు. రాత్రి 8 గంటలకు పడాల్సిన టాస్ లేట్ అయ్యింది. ఆ తర్వాత వరుణుడు విరామం తీసుకున్నా మళ్లీ దంచికొట్టాడు. రాత్రి 11 గంటల వరకు వేచి చూశారు. కానీ.. వర్షం పడటం, గ్రౌండ్ తడిసిపోయి ఉండటంతో మ్యాచ్ నిర్వహణ అసాధ్యమని అంపైర్లు తేల్చారు. చివరకు ఐర్లాండ్‌తో అమెరికా మ్యాచ్ రద్దు చేశారు. ఐర్లాండ్, అమెరికాకు చెరో పాయింట్ ఇచ్చారు. దాంతో.. అమెరికా జట్టు పాయింట్లు ఐదుకి చేరాయి. గ్రూప్-ఏలో ఆడిన మూడు మ్యాచ్‌లు గెలిచి.. భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 5 పాయింట్లతో యూఎస్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. తద్వారా తదుపరి దశకు అర్హత సాధించింది.
పాకిస్థాన్ ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడితే.. కేవలం ఒక్కదానిలోనే విజయం సాధించింది. మొదట సూపర్ ఓవర్‌లో అమెరికా షాక్ ఇస్తే.. ఆ తర్వాత భారత్ జట్టు చిత్తుగా ఓడించింది. రెండు పాయింట్లతో టేబుల్ మూడో స్థానంలో ఉంది. అయితే.. సూపర్-8కి అదృష్టంతో వెళ్లాలని భావించింది. అమెరికాపై ఐర్లాండ్ గెలిచి.. ఆ తర్వాత ఆదివారం తాము ఐర్లాండ్‌తో జరగబోయే మ్యాచ్ లో ఘన విజయం సాధించడం ద్వారా తదుపరి దశకు వెళ్లాలని అనుకుంది. ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై నెగ్గినా పాకిస్తాన్‌కు నాలుగు పాయింట్లే ఉంటాయి. కానీ.. అమెరికా ఇప్పటికే ఐదుపాయింట్లతో ఉంది. కాబట్టి అమెరికాను పాక్ దాటే చాన్సే లేదు. కానీ.. వరుణుడు అమెరికాకు ఒక పాయింట్ వచ్చేలా చేయడంతో పాక్ ఇంటి బాట పట్టాల్సి వస్తోంది.