జనసంద్రమైన ముంబై.. టీమిండియాకు అభిమానుల బ్రహ్మరథం

టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు జూలై 4, గురువారం నాడు ముంబైలో ఘనంగా విజయోత్సవ వేడుక జరుపుకుంది.

By అంజి  Published on  5 July 2024 6:48 AM IST
T20 World Cup, India, victory parade, Mumbai

జనసంద్రమైన ముంబై.. టీమిండియాకు అభిమానుల బ్రహ్మరథం

టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు జూలై 4, గురువారం నాడు ముంబైలో ఘనంగా విజయోత్సవ వేడుక జరుపుకుంది. ఎంఎస్‌ ధోని సారథ్యంలో 2011లో భారతదేశం తమ ఓడీఐ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న ఐకానిక్ వాంఖడేలో భారత జట్టు మెరైన్ డ్రైవ్ ద్వారా ఓపెన్-బస్ పరేడ్‌ను నిర్వహించి, ఆపై నృత్యం, సంగీతంతో సంబరాలు చేసుకుంది.

ఢిల్లీ నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన భారత జట్టుకు అడుగడుగునా ఘనమైనా స్వాగతం లభించింది. న్యూఢిల్లీ నుంచి విస్తారా విమానంలో టీమిండియా ముంబైలో దిగింది. ప్రపంచ ఛాంపియన్లు ముంబై విమానాశ్రయంలో వాటర్ సెల్యూట్ అందుకున్నారు, ఈ వేడుక విమానం, దాని సిబ్బందికి గౌరవం, గౌరవ చిహ్నంగా నిర్వహించబడుతుంది.

ఎయిర్‌పోర్టు వెలుపల భారత జట్టుకు నాయకత్వం వహించాల్సిందిగా హార్దిక్ పాండ్యాను టీమ్ ఇండియా కోరింది. తన సొగసైన సన్ గ్లాసెస్ మరియు స్వాగర్‌తో, పాండ్యా ఒక చేత్తో T20 ప్రపంచ కప్ ట్రోఫీని ఎత్తాడు. భారీ నినాదాల మధ్య విమానాశ్రయం నుండి బయటకు వెళ్లాడు.

ఎయిర్‌పోర్ట్‌దగ్గర అభిమానులు భారీగా నిలిచి భారత జట్టును ఆహ్వానించారు. ఆ తర్వాత నారిమన్‌ పాయింట్‌కు వచ్చిన టీమిండియా.. నిన్న రాత్రి 7.30 గంటలకు స్పెషల్‌ ఓపెన్‌ బస్సులో విజయయాత్ర చేసింది. ఈ యాత్రతో మెరైన్‌ రోడ్డు జన సంద్రంతో కిక్కిరిసిపోయింది. అభిమానులు తమ స్టార్‌ క్రికెటర్లపై పూల వర్షం కురిపించారు. జయహో భారత్‌, భారత్‌ మాతాకీ జై, వందే మాతరం లాంటి నినాదాలతో హోరెత్తించారు. రోహిత్‌, కోహ్లీ అంటూ ఊగిపోయారు.

అభిమానులు అభివాదం చేస్తూ టీమిండియా ముందుకు కదిలింది. ఆటగాళ్లు బస్సు ఓపెన్‌ టాప్‌లో ఉండి కప్‌ను ప్రదర్శిస్తూ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. విజయం సాధించిన భారత జట్టును దగ్గరగా చూసేందుకు అభిమానులు చెట్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కారు . ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో ఓపెన్-బస్ పరేడ్‌తో టి20 ప్రపంచకప్ ఛాంపియన్‌లు తమ విజయాన్ని జరుపుకున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ నేతృత్వంలో గురువారం భారత్ చక్ దే ఇండియా పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేసింది.

Next Story