లెజెండరీ భారత క్రికెటర్ కన్నుమూత

హైదరాబాద్‌కు చెందిన అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరు, భారత జట్టు మాజీ ఆల్ రౌండర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూశారు.

By Medi Samrat
Published on : 12 March 2025 7:19 PM IST

లెజెండరీ భారత క్రికెటర్ కన్నుమూత

హైదరాబాద్‌కు చెందిన అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరు, భారత జట్టు మాజీ ఆల్ రౌండర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూశారు. బుధవారం నాడు అమెరికాలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు.

1971లో ది ఓవల్‌లో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌ను గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నారు. అబిద్ అలీ 29 టెస్ట్‌ల్లో తన మీడియం-పేస్‌తో 47 వికెట్లు పడగొట్టారు. ఆయన ఒక అద్భుతమైన ఫీల్డర్.. వికెట్ల మధ్య మెరుపు వేగంతో పరిగెత్తగలరని పేరుగాంచిన అబిద్ అలీ 1967-68లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. అదే సిరీస్‌లో సిడ్నీ టెస్ట్‌లో 78, 81 పరుగులు కూడా చేశారు. సయ్యద్ అబిద్ అలీ మాల్దీవులు, యుఏఈ, ఆంధ్ర రంజీ జట్ల కోచింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఆయన తన కుమారుడు ఫకీర్ అలీని భారత మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మాణీ కుమార్తెకు ఇచ్చి పెళ్లి చేశారు.

Next Story