Olympics 2024 : మరో పతకంపై ఆశలు రేపుతున్న స్వప్నిల్ కుసాలే..!
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటివరకు షూటింగ్‌లో రెండు పతకాలు సాధించింది.
By Medi Samrat Published on 31 July 2024 9:53 AM GMTపారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటివరకు షూటింగ్‌లో రెండు పతకాలు సాధించింది. మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్‌లో మొదటి కాంస్య పతకాన్ని గెలుచుకోగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ టీమ్‌లో ఆమె, సరభ్‌జోత్ తో కలిసి రెండవ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
తాజాగా ఐదవ రోజు పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఏడో స్థానంలో నిలిచి భారత్‌కు చెందిన స్వప్నిల్ కుసాలే 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ పురుషుల ఫైనల్‌కు అర్హత సాధించాడు. అయితే.. అతని సహచరురాలు ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. స్వప్నిల్ ఫైనల్ చేరడంతో భారత్ స్వర్ణ పతక ఆశలు సజీవంగా ఉన్నాయి.
క్వాలిఫైయింగ్ రౌండ్‌లో కుసాలే 590 పరుగులు చేసి ఏడో స్థానంలో నిలిచాడు. ఐశ్వర్య ప్రతాప్ సింగ్ మాత్రం షూట్‌లో పొరపాటు చేసి ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ మొదటి రెండు రౌండ్ల తర్వాత 8వ స్థానంలో ఉంది. కానీ స్టాండింగ్ షూట్ ముగిసే సమయానికి ఆమె 8వ స్థానం నుండి 11వ స్థానానికి పడిపోయింది. ఈ రౌండ్‌లో టాప్ 8 షూటర్లు మాత్రమే ఫైనల్స్‌కు చేరుకుంటారు. దీంతో ఐశ్వర్య ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది.
స్వప్నిల్ కుసాలే 6 ఆగస్టు 1995న పూణేలో జన్మించాడు. స్వప్నిల్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. స్వప్నిల్ షూటింగ్ జర్నీ 2009లో ప్రారంభమైంది. అతని తండ్రి అతన్ని మహారాష్ట్రలోని క్రీడా ప్రబోధినిలో చేర్చారు. ఒక సంవత్సరం తర్వాత కుసాలే షూటింగ్‌ని ఎంచుకున్నాడు. తన కృషి, ప్రతిభతో కుసాలే త్వరగా గుర్తింపు పొందాడు.