అరంగేట్రంలో 'డబుల్ సెంచరీ' బాది 'అదుర్స్' అనిపించాడు..!

Suved Parkar 2nd Indian to score double hundred on first-class debut. బెంగళూరులోని ఆలూర్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్‌లో

By Medi Samrat  Published on  7 Jun 2022 11:19 AM GMT
అరంగేట్రంలో డబుల్ సెంచరీ బాది అదుర్స్ అనిపించాడు..!

బెంగళూరులోని ఆలూర్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ సువేద్ పార్కర్ డబుల్ సెంచరీలో అద‌ర‌గొట్టాడు. దీంతో 21 ఏళ్ల సువేద్ పార్కర్ ఈ మ్యాచ్ ద్వారా చిరస్మరణీయమైన ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. ఈ ఫీట్ సాధించిన‌ 2వ ముంబై బ్యాట్స్‌మెన్‌ అయ్యాడు. అంత‌కుముందు అమోల్ మజుందార్ తన రంజీ ట్రోఫీ అరంగేట్రంలో ఈ రికార్డు సాధించాడు.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ చేత శిక్షణ పొందిన సువేద్ పార్కర్.. రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్ 2వ రోజున 200 పరుగుల మార్క్‌ను దాటాడు. దీంతో ఆ మ్యాచ్‌లో 600 ముంబై పరుగుల మార్కును దాటింది. ముంబై బ్యాటింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు వేగంతో 153 పరుగులు చేయ‌గా.. నం. 4లో బ్యాటింగ్ కు దిగిన సువేద్ పార్కర్, సర్ఫరాజ్ తో క‌లిసి 277 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

1993-94 రంజీ సీజన్‌లో ఫరీదాబాద్‌లో హర్యానాపై ముంబై తరఫున ఆడిన అమోల్ మజుందార్ 260 పరుగులు చేశాడు. సోమ‌వారం వారం వ‌ర‌కూ ఈ రికార్డ్ అత‌ని పేరిట‌నే ఉంది. సువేద్ పార్కర్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాకుండా పార్కర్ ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ కొట్టిన 12వ భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో కోల్‌కతాలో మిజోరామ్‌పై జ‌రిగిన మ్యాచ్‌లో బీహార్‌కు చెందిన సకిబుల్ గని 341 పరుగులతో ట్రిపుల్ సెంచరీ చేసి ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలో ఈ ఘ‌ట‌న‌త సాధించిన‌ ఏకైక భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.
Next Story
Share it