32 బంతుల్లో సెంచరీ బాదిన సూర్య వంశీ

నవంబర్ 14, శుక్రవారం దోహాలో జరిగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో యూఏఈతో జరిగిన ఇండియా ఎ తొలి మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు.

By -  Medi Samrat
Published on : 14 Nov 2025 7:37 PM IST

32 బంతుల్లో సెంచరీ బాదిన సూర్య వంశీ

నవంబర్ 14, శుక్రవారం దోహాలో జరిగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో యూఏఈతో జరిగిన ఇండియా ఎ తొలి మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో 42 బంతులు ఆడిన వైభవ్ 144 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో 15 సిక్సర్లు, 11 ఫోర్లు వున్నాయి.

వైభవ్ సూర్యవంశీ ట్వంటీ20 క్రికెట్‌లో తన రెండవ సెంచరీని సాధించాడు. 2025లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపిఎల్‌ మ్యాచ్ లో రాజస్థాన్ తరపున వైభవ్ 35 బంతుల్లో సెంచరీ సాధించాడు.

Next Story