టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కివీస్‌తో మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఫలితంగా టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191పరుగులు చేసింది. న్యూజిలాండ్ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఇషాన్ కిషన్ (36; 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్), పంత్‌లు ఓపెనర్లుగా వచ్చారు. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ పంత్ 6 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 36 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్‌తో జత కలిసిన సూర్యకుమార్ యాదవ్ తొలుత ఆచితూచి ఆడాడు. కొంచెం కుదురుకున్న తరువాత జోరు పెంచాడు. దొరికిన బంతిని దొరికినట్లుగా బాదాడు. ఈ క్రమంలో 49 బంతుల్లో సెంచరీని చేశాడు. మొదటి యాబై పరుగులు చేయడానికి 32 బంతులు తీసుకున్న సూర్య.. తరువాతి యాభై పరుగులు పరుగులు చేయడానికి కేవలం 17 బంతులు మాత్రమే తీసుకున్నాడు అంటే ఆఖర్లో సూర్య ఏ స్థాయిలో విధ్వంసం కొనసాగించాడో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్(13), హర్థిక్ పాండ్య(13) లు ఓ మోస్తారుగా రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ మూడు వికెట్లు తీయగా, ఫెర్గూసన్ రెండు, ఇష్ సోథీ ఓ వికెట్ పడగొట్టారు.