ఓట‌మికి కార‌ణాలివే.. కెప్టెన్ సూర్యకుమార్ యాద‌వ్‌

చండీగఢ్ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా ఎదురుదాడి చేసి 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్లు పేలవంగా బౌలింగ్ చేశారు.

By -  Medi Samrat
Published on : 12 Dec 2025 8:11 AM IST

ఓట‌మికి కార‌ణాలివే.. కెప్టెన్ సూర్యకుమార్ యాద‌వ్‌

చండీగఢ్ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా ఎదురుదాడి చేసి 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్లు పేలవంగా బౌలింగ్ చేశారు. అర్ష్‌దీప్‌ సింగ్‌, బుమ్రా చాలా పరుగులు ఇచ్చారు. అదే సమయంలో బ్యాటింగ్ లైనప్‌ను నిరంతరం మార్చే గౌతమ్ గంభీర్ వ్యూహం కూడా బెడిసికొట్టింది. అయితే హెడ్ కోచ్ చేసిన తప్పులను కెప్టెన్ సూర్య దాచే ప్ర‌య‌త్నం చేశాడు.

మ్యాచ్ అనంత‌రం సూర్యకుమార్ మాట్లాడుతూ.. ముందుగా బ్యాటింగ్ చేసి ఉండాల్సిందని భావిస్తున్నాను. మేము ముందుగా బౌలింగ్ చేసాము. అందువ‌ల్ల‌ మేము ప్రత్యేకంగా ఏమీ చేయలేము. మేము మొదట బౌలింగ్ చేయడం ద్వారా మంచి పునరాగమనం చేయగలమం అనుకున్నాం, కాని ఈ వికెట్‌పై లెంగ్త్‌ ఎంత ముఖ్యమో దక్షిణాఫ్రికా అర్థం చేసుకుంది. ఇది నిరంత‌రం అభ్యాస ప్రక్రియ. నేర్చుకుంటూ ముందుకు సాగాలి. కొంత మంచు కూడా ఉంది. మ‌నం అనుకున్న‌ట్లు పనులు జరగకపోతే.. మ‌న‌కు మరొక ప్రణాళిక ఉండాలి.. కానీ మేము దానిని అమలు చేయలేదు.

అభిషేక్‌పై ఎల్లవేళలా ఆధారపడలేం కాబట్టి నేనూ, శుభ్‌మాన్ కూడా మంచి ఆరంభాన్ని అందించగ‌ల‌గాల‌ని భారత కెప్టెన్ అన్నాడు. గిల్‌ బ్యాటింగ్ చేస్తున్న విధానం, అతనికి బ్యాడ్ డేగా ఉండవచ్చు. నేను, శుభ్‌మన్, మరికొందరు బ్యాట్స్‌మెన్ బాధ్యత వహించాలి. అది సరైన లక్ష్యం అయి ఉంటుందని నేను భావిస్తున్నాను. సరే, పర్వాలేదు, మొదటి బంతికే శుభ్‌మాన్ అవుట్ అయ్యాడు. నేను ఆ బాధ్యత తీసుకుని పిచ్‌పై ఉండి బ్యాటింగ్ చేసి ఉండాల్సింది. మేము ఓట‌మి నుంచి నేర్చుకుంటాము.. తదుపరి మ్యాచ్‌లో మెరుగ్గా రాణిస్తాము. ఈ ఫార్మాట్‌లో అక్షర్ చాలా బాగా బ్యాటింగ్ చేయ‌డం గత మ్యాచ్‌లో చూశాం. ఈ రోజు కూడా అతను అదే పద్ధతిలో బ్యాటింగ్ చేస్తాడ‌ని మేము కోరుకున్నాము. దురదృష్టవశాత్తు అది జరగలేదు, కానీ అతను బాగా బ్యాటింగ్ చేశాడు. మరి తర్వాత మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలని అన్నాడు.

ఇదిలావుంటే.. ధర్మశాలలో జరిగే మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు ముందు భారత్ చాలా ఆలోచించాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలుపొందినా.. ఆ కష్టకాలం నుంచి హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్‌నే కాపాడిందని లోతుగా విశ్లేషిస్తే తెలిసిపోతుంది. రెండో మ్యాచ్‌లో కూడా అలాంటిదే కనిపించింది, మిగిలిన బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతుండగా తిలక్ వర్మ బాధ్యత తీసుకున్నాడు.

భారత బౌలర్లు కూడా చాలా బలహీనంగా ఉన్నారు. బుమ్రా, అర్ష్‌దీప్‌లకు వికెట్ దక్కకపోవడమే కాకుండా, చాలా పరుగులు కూడా ఇచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బౌలర్లిద్దరూ తమ లైన్ అండ్ లెంగ్త్‌ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. బ్యాటింగ్ వ్యూహంపై కూడా పని చేయాల్సి ఉంటుంది. స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్‌పై పునరాలోచించాలి. అలా అయితేనే సిరీస్‌ను గెల‌వ‌గ‌లం.

Next Story