సూర్య కుమార్ యాదవ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన దూకుడును చూపిస్తూ ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ తన మార్క్ బ్యాటింగ్‌తో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో సూర్య కుమార్ యాదవ్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లతో దూసుకు వస్తున్నాడు. ప్రస్తుతం నంబర్ 1 ర్యాంకులో ఉన్న బాబర్ ఆజామ్‌కు చాలా దగ్గరగా వచ్చేస్తున్నాడు సూర్య. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో (44బంతుల్లో 76 పరుగులు)తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధించాడు. ఈ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక ప్రస్తుతం బాబర్ ఆజామ్ (818)పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. సూర్య కేవలం రెండు రేటింగ్ పాయింట్లు (816)పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20లలో 500+ స్కోరు చేసి 50 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మంగళవారం వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ ఆ జట్టు ఓపెనర్ బ్రాండన్ కింగ్‌ను ఔట్ చేయడం ద్వారా అతడు ఈ ఘనత అందుకున్నాడు. కింగ్ వికెట్ టీ20లలో హార్దిక్‌కు 50వది. భారత జట్టు తరఫున టీ20లలో 500+ పరుగులు, 50 వికెట్లు తీసిన ఆటగాడిగా పాండ్యా ఘనత సాధించాడు. పాండ్యాకు సమీపంలో రవీంద్ర జడేజా (50 వికెట్లు, 422 పరుగులు) మాత్రమే ఉన్నాడు. భారత్ తరఫున వినూ మాన్కడ్ టెస్టులలో ఈ ఘనత (500+ పరుగులు, 50+ వికెట్లు) సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. వన్డేలలో ఈ రికార్డు కపిల్ దేవ్ అందుకున్నాడు.