వన్డే ప్రపంచ కప్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. తెలుగోడికి దక్కని ఛాన్స్
2023 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ..
By Medi Samrat Published on 5 Sept 2023 2:34 PM IST2023 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో 15 మంది ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. ఆసియా కప్ కు ఎంపిక కాని యుజ్వేంద్ర చాహల్‌ను వరల్డ్ కప్ జట్టులోకి కూడా తీసుకోలేదు. అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ జట్టులో తమ స్థానాన్ని సంపాదించుకోవడంలో విజయవంతమయ్యారు. టీ20లలో లలో ప్రపంచ నం.1 బ్యాట్స్‌మెన్ అయిన సూర్యకుమార్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఆసియా కప్ గ్రూప్-4 మ్యాచ్‌ల కోసం శ్రీలంకకు వెళ్లిన కేఎల్ రాహుల్‌కు జట్టులో స్థానం కల్పించారు. 31 ఏళ్ల రాహుల్ ఎన్సీఏలో పునరావాసం కొనసాగిస్తూ ఇటీవల బ్యాటింగ్, కీపింగ్ చేస్తూ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోగలిగాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ కోసం శ్రీలంకకు వెళ్లిన జట్టులోని తిలక్, శాంసన్, ప్రసిద్ధ్ కృష్ణ వరల్డ్ కప్‌కు ఎంపిక అవలేదు. ప్రసిద్ధ్, జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే గాయాల నుండి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో బుమ్రాతో పాటు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు.
కుల్దీప్ యాదవ్ జట్టులో ఏకైక స్పిన్నర్‌గా ఎంపికయ్యాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మరో ఇద్దరు స్పిన్ ఆప్షన్‌లు. పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా తన స్థానాన్ని నిలుపుకున్నాడు.
జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యుకె), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (విసి), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా