బాబర్ ఆజామ్‌ను ధాటేసిన సూర్యకుమార్ యాదవ్
Suryakumar back to career-best No. 2 in T20I rankings. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ దూసుకుపోతున్నాడు.
By Medi Samrat Published on 28 Sep 2022 1:45 PM GMTఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ దూసుకుపోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల సీరిస్‌లో సూర్యకుమార్ యాదవ్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకూ ఈ స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం ఉండగా.. అతన్ని కిందకు నెట్టి సూర్య రెండో స్థానానికి చేరుకున్నాడు. మొదటి స్థానంలో పాక్ కు చెందిన మొహమ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి టాప్ టెన్‌లో సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు. టీమిండియా ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ శర్మ 13వ స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 15వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడంతో త్వరలోనే టాప్-10 లోకి వస్తాడని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఇక టీ20 ప్రపంచ కప్ కు ముందు భారత్ మూడు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడనుంది. అది కూడా దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నేడు తిరువనంతపురంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. బుమ్రా, చహల్ ఈ మ్యాచ్ లో ఆడడంలేదు. వారి బదులు దీపక్ చహర్, రవిచంద్రన్ అశ్విన్ లు తుదిజట్టులో ఉన్నారు.
భారత జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, అర్షదీప్ సింగ్.
దక్షిణాఫ్రికా:
టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రిలీ రూసో, ఐడెన్ మార్ క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, ఆన్రిచ్ నోర్జే, తబ్రైజ్ షంసీ.