చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తానెంత నమ్మకమైన ఆటగాడో మరోమారు నిరూపించుకున్నాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సీఎస్‌కేను తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఐపీఎల్-13 సీజన్‌కు రైనా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు ధోనీతో రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.
కానీ.. రైనా తాజాగా 36 బంతులు ఎదుర్కొని 54 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్సు చూసిన ఎవరికైనా రైనా మరికొంతకాలం టీమిండియాకు ఆడి వుండొచ్చు కదా.. అనే అబిప్రాయానికి రాకమానరు. ఇక రైనా ఇన్నింగ్సులో అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో మిడ్‌వికెట్ దిశగా కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది. రైనా ఇన్నింగ్సుకు తోడు చివర్లో సామ్ కరన్ 15 బంతుల్లోనే 34 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో సీఎస్‌కే భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం చేధనకు దిగిన ఢిల్లీ ఓపెనర్లు మాంచి శుభారంభానిచ్చారు.