బ్రేకింగ్‌.. అన్ని ఫార్మాట్ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రైనా

Suresh Raina announces retirement from all formats of cricket.టీమ్ఇండియా క్రికెట‌ర్ సురేశ్ రైనా ఆట‌కు వీడ్కోలు ప‌లికాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sept 2022 1:10 PM IST
బ్రేకింగ్‌.. అన్ని ఫార్మాట్ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రైనా

టీమ్ఇండియా క్రికెట‌ర్ సురేశ్ రైనా ఆట‌కు వీడ్కోలు ప‌లికాడు. ఆట‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటున్న‌ట్లు తెలిపాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదికా వెల్ల‌డించాడు. 'ఇంతకాలం దేశానికి, నా రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు ప్రాతినిధ్య‌వం వ‌హించినందుకు గ‌ర్వంగా బావిస్తున్నా. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లు, లీగుల నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నా. నా పై విశ్వాసం ఉంచి ఎల్ల‌ప్పుడు అండ‌గా నిలిచిన బీసీసీఐ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ , చెన్నై టీమ్‌, రాజీవ్ శుక్లా సర్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా 'అని రైనా ట్వీట్ చేశాడు.

ధోని రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన నిమిషాల్లోనే 2020 ఆగ‌స్టు 15న రైనా అంత‌ర్జాతీయ క్రికెట్ కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి ఐపీఎల్‌, రంజీల్లో మాత్ర‌మే ఆడుతున్నాడు. 2022 ఐపీఎల్ వేలంలో రైనాను ఏ జ‌ట్టు కొనుగోలు చేయ‌లేదు. దీంతో కామెంటేట‌ర్‌గా అవ‌తారం ఎత్తాడు. ఈ క్ర‌మంలోనే అన్ని ఫార్మాట్ల కు రైనా రిటైర్ మెంట్ ప్ర‌క‌టించాడు.

2005లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సురేశ్ రైనా.. 226 వ‌న్డేల్లో 5615 ప‌రుగులు, 78 టీ20ల్లో 1605, 18 టెస్టుల్లో 768 ప‌రుగులు చేశాడు. ఇక త‌న ఐపీఎల్ కెరీర్‌లో ఎక్కువ కాలం పాటు చెన్నై జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించిన రైనా 205 ఐపీఎల్ మ్యాచులు ఆడి 5,528 ప‌రుగులుచేశాడు.

Next Story