ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఈ నెల 14 న భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జరగకుండా అడ్డుకోవాలని, రద్దు చేయాలని ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఊర్వశి జైన్ అనే న్యాయ విద్యార్థిని మరో ముగ్గురితో కలిసి ఈ పిల్ దాఖలు చేసింది. మ్యాచ్ ఆదివారం జరగనున్న నేపథ్యంలో తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని పిటిషన్ దారులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
సుప్రీంకోర్టు ఈ మ్యాచ్ కు అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదొక మ్యాచ్ మాత్రమే, జరిగితే జరగనివ్వండి, నష్టమేంటని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మ్యాచ్ జరగడం జాతీయ గౌరవం, ప్రజల మనోభావాలకు విరుద్ధమైన సందేశాన్ని పంపుతుందని పిటీషనర్ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలకన్నా, పౌరుల ప్రాణాలకన్నా, సైనికుల ప్రాణత్యాగాల కన్నా ఈ మ్యాచ్ ఎక్కువ కాదన్నారు.