స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడికి క‌రోనా.. ఈ రోజు మ్యాచ్ జ‌రిగేనా..?

Sunrisers Hyderabad player tests positive. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట‌గాడు నటరాజన్ కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది.

By Medi Samrat  Published on  22 Sep 2021 10:19 AM GMT
స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడికి క‌రోనా.. ఈ రోజు మ్యాచ్ జ‌రిగేనా..?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట‌గాడు నటరాజన్ కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ రోజు ఉద‌యం జ‌రిపిన ప‌రీక్ష‌ల‌లో అత‌నికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు ఐసోలేస‌న్‌కు వెళ్లాడు. అలాగే న‌ట‌రాజ‌న్‌తో సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురు కూడా ఐసోలోషన్‌లోకి వెళ్లారు. దీంతో సన్‌రైజర్స్ కు ఈరోజు సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్ జరగాల్సిన మ్యాచ్​ సందిగ్ధంలో పడింది. న‌ట‌రాజ‌న్‌తో స‌న్నిహితంగా ఆరుగురిని కూడా వైద్య‌బృందం గుర్తించింది. దీంతో వారు కూడా ఐసోలేస‌న్‌లో ఉన్నారు.

1. విజయ్ శంకర్ - ఆటగాడు

2. విజయ్ కుమార్ - టీమ్ మేనేజర్

3. శ్యామ్ సుందర్ జె - ఫిజియోథెరపిస్ట్

4. అంజనా వన్నన్ - డాక్టర్

5. తుషార్ ఖేడ్కర్ - లాజిస్టిక్స్ మేనేజర్

6. పెరియసామి గణేషన్ - నెట్ బౌలర్

ఈ రోజు రాత్రి 7:30 గంట‌ల‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక‌గా మ్యాచ్ జరగాల్సివుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా మ్యాచ్ జ‌రుగుతుందా.. లేక.. వాయిదా వేస్తారా అన్న‌ది తెలియాల్సివుంది.

AdvertisementNext Story
Share it