ఒలింపిక్ క్రీడల్లో భారత్ తొలి సంచలనం నమోదుచేసిన సంగతి తెలిసిందే. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ ఆనందంలో ఉన్న భారత్‌కు మరో గుడ్‌న్యూస్. టెన్నిస్‌లో 25 ఏళ్ల తర్వాత ఇండియా సంచలనం సృష్టించింది. భారత టెన్నీస్ ఆటగాడు సుమిత్ నాగల్ అద్భుత ఆటతీరుతో రెండో రౌండ్‌కు చేరుకుని 25 ఏళ్ల తర్వాత టెన్నీస్‌లో సింగిల్స్ లో తొలి రౌండ్ ధాటిన ఆటగాడిగా నిలిచాడు.
శనివారం మధ్యాహ్నం జరిగిన పురుషుల టెన్నీస్ సింగిల్స్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన డెనిస్ ఇస్తోమిన్‌ను 64, 6-7(6), 6-4 స్కోరుతో వరుస సెట్లలో ఓడించి తొలి రౌండ్ విజయవంతంగా ముగించాడు. వీరి మధ్య పోరాటం కేవలం 34 నిమిషాల్లోనే పూర్తయింది. నాగల్ ప్రస్తుతం 144 ర్యాంకులో ఉన్నాడు. ఇస్తోమిన్ ఒకప్పుడు 33వ ర్యాంకులో ఉండగా.. ప్రస్తుతం 160కి పడిపోయాడు.
సుమిత్ నాగల్ కంటే ముందు ఈ ఫీట్‌ను 1988 లో జీషన్ అలీ, 1996 లో లియాండర్ పేస్ మాత్రమే సాధించారు. అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ కాంస్య పతకాన్ని గెలుచుకుని రికార్డు సృష్టించాడు. పేస్ పతకం గెలిచే నాటికి ప్రస్తుతం సంచలనం సృష్టించిన సుమిత్ నాగల్ (23) పుట్టకపోవడం విశేషం.