పారాలింపిక్స్ : జావెలిన్‌ త్రోలో సుమిత్ అంటిల్‌కు స్వర్ణం

Sumit Antil Wins Gold with World Record Throw. పారాలింపిక్స్‌లో భార‌త ఆట‌గాళ్లు అద‌ర‌గొడుతున్నారు. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌-64

By Medi Samrat  Published on  30 Aug 2021 7:06 PM IST
పారాలింపిక్స్ : జావెలిన్‌ త్రోలో సుమిత్ అంటిల్‌కు స్వర్ణం

పారాలింపిక్స్‌లో భార‌త ఆట‌గాళ్లు అద‌ర‌గొడుతున్నారు. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌-64 విభాగంలో సుమిత్ అంటిల్ స్వర్ణం సాధించాడు. అయితే బంగారు ప‌త‌కాన్ని ముద్దాడే క్ర‌మంలో సుమిత్ మూడుసార్లు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ప్రయత్నంలో 66.95 మీటర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అతడు.. రెండో ప్రయత్నంలో 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే తిరగరాశాడు. ఇక ఐదో ప్రయత్నంలో మరింత వేగంతో ఈటెను విసరగా అది 68.55 మీటర్లు దూసుకెళ్లడంతో కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో సుమిత్‌ పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మైఖల్‌ బురియన్‌ 66.29 మీటర్లు విసిరి రజతం సాధించగా.. శ్రీలంక అథ్లెట్‌ దులాన్‌ కొడితువక్కు 65.61 మీటర్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకున్నాడు.



Next Story