రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన భార‌త ఫాస్ట్‌బౌల‌ర్‌

Sudeep Tyagi retires From Cricket. భార‌త ఫాస్ట్ బౌల‌ర్ సుదీప్ త్యాగి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు తెలిపాడు.

By Medi Samrat  Published on  18 Nov 2020 11:17 AM IST
రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన భార‌త ఫాస్ట్‌బౌల‌ర్‌

భార‌త ఫాస్ట్ బౌల‌ర్ సుదీప్ త్యాగి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు తెలిపాడు. 2009 డిసెంబర్‌లో ఫిరోజ్ షా కోట్ల వేదిక‌గా శ్రీలంకతో జ‌రిగిన వన్డేతో అర‌గ్రేటం చేసిన త్యాగి.. టీమ్ఇండియా తరుపున నాలుగు వ‌న్డేల్లో, ఒక టీ20లో ప్రాతినిధ్యం వ‌హించాడు. వ‌న్డేల్లో మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఫిబ్రవరి 2010లో అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో తన చివరి వన్డే ఆడాడు. అనంత‌రం మ‌ళ్లీ జాతీయ జ‌ట్టులో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు ఈ 33 ఏళ్ల ఫాస్ట్ బౌల‌ర్‌.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)లో 14 మ్యాచులు ఆడి 6 వికెట్లు తీసుకున్న త్యాగి.. 41 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 109 వికెట్లు తీశాడు. లిస్ట్-ఎలో 23 మ్యాచ్‌ల్లో పాల్గొని 31 వికెట్లు ప‌డ‌గొట్టాడు. క్రికెట్ కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్లు సోషల్ మీడియా ద్వారా వెల్ల‌డించాడు. తాను ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలలో.. త‌న‌ కలను' వీడ్కోలు 'అని పిలవడం చాలా కష్టమని ట్వీట్ చేశాడు.



ప్రతి క్రీడాకారుడు దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలుకంటున్నదాన్ని నేను సాధించాను. నా అర‌గ్రేట వ‌న్డే ధోని నాయ‌క‌త్వంలో ఆడ‌డం నాకు సంతోషం. అందుకు ధోనికి కృత‌జ్ఞ‌త‌లు. అంతేకాకుండా జాతియ జండాను కలలో కూడా నా గుండెలపైనే ఉంచుకున్నాను. తన మోడల్స్ అయిన సురేష్ రైనా, ఆర్‌పీ సింగ్, మొహమ్మద్ కైఫ్‌ల సరసన ఆడే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బిసిసిఐ అధికారులు, నా కోచ్‌లు, టీమ్ మేట్స్, టీమ్ మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు. ఇది చాలు నా క్రీడా జీవితానికి ఇక సెలవు. క్రికెట్‌లోని ప్రతి ఫార్మాట్ నుంచి నేను తప్పుకుంటున్నాన'ని ట్వీట్ చేశాడు.


Next Story