ఒక్కసారిగా షాక్ కు గురైన‌ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి..!

Star tennis player Eugenie Bouchard was left in deep shock. స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి యూజీనీ బౌచర్డ్ వాంకోవర్‌లోని ఓడ్లమ్ బ్రౌన్ వాన్‌ ఓపెన్‌లోకి

By Medi Samrat  Published on  20 Aug 2022 3:30 PM GMT
ఒక్కసారిగా షాక్ కు గురైన‌ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి..!

స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి యూజీనీ బౌచర్డ్ వాంకోవర్‌లోని ఓడ్లమ్ బ్రౌన్ వాన్‌ ఓపెన్‌లోకి ప్రవేశించినప్పుడు ఒక్కసారిగా షాక్ కు గురైంది. అంతగా షాక్ కు గురిచేసిన విషయం ఏమిటంటే ఆమె ఐడీ కార్డు. ఆమె ఐడీ కార్డుపై నల్లటి స్విమ్‌సూట్‌లో ఉంది. సాధారణంగా ఐడీ కార్డు మీద ఫోటో అంటే పాస్ పోర్ట్ ఫోటో ఉంటుంది. కానీ ఏకంగా బికినీ ఫోటోను ఐడీ కార్డులో ప్రింట్ చేయించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటో 2018 నాటిది. ఒక మ్యాగజైన్‌ ఫోటో షూట్ లో ఆమె బికినీతో కనపడింది.. దాన్నే ఇప్పుడు ఐడీ కార్డులో చూపించారు.


యూజీనీ బౌచర్డ్‌కు ఈ వింత అనుభవం ఎదురైంది. కెనడా మహిళా క్రీడాకారిణి తాజాగా టోర్నమెంట్‌లో పాల్గొంది. తొలి రౌండ్‌ మ్యాచ్‌ కూడా ఆడింది. ఆమెకిచ్చిన ఐడీ కార్డుపై సాధారణ ఫోటో కాకుండా టూ పీస్‌ బికినీలో స్విమ్‌సూట్‌ ధరించి ఉన్న ఫోటోను ముద్రించారు. బ్లాక్‌ స్విమ్‌ సూట్‌లో బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఆమె ఫోటోను ఈ టోర్నమెంట్‌కు వాడారు. యూజీని బౌచర్డ్‌ 2018లో స్పోర్ట్స్‌ మ్యాగజైన్‌కు సంబంధించి కవర్‌ షూట్‌ కోసం ఈ బికినీ ధరించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓల్డమ్‌ బ్రౌన్‌ వాన్​ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఐడీ ఫోటోను షేర్‌ చేసి.. ''హ్యూజీని బౌచర్డ్‌.. డబ్ల్యూటీఏ ప్లేయర్‌''.. ''ఈ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్న అధికారులకు ఒక ప్రశ్న.. ఈ ఫోటో ఎందుకు వాడారో నాకు సమాధానం కావాలి.. ప్లీజ్‌ వివరణ ఇవ్వండి'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. అది కూడా నవ్వుతూ ప్రశ్నించింది ఆమె.


Next Story
Share it