ఈసారి శ్రీలంక ఆటగాళ్లకు ఐపీఎల్‌ వేలంలో నో ఛాన్స్ ఎందుకో..!

Sri Lankan players were not picked on basis of availability. క్రికెట్‌లో లంక జట్టుకు కచ్చితమైన షెడ్యూల్‌ లేకపోవడమే ఆ జట్టు ఆటగాళ్లను తీసుకోకపోవడానికి ప్రధాన కారణమని చెప్పాడు.

By Medi Samrat  Published on  23 Feb 2021 11:42 AM GMT
Sri Lankan players were not picked on basis of availability

ఈసారి ఐపీఎల్‌ వేలంలో ఒక్క శ్రీలంక ఆటగాడినీ తీసుకోకపోవడంపై ఆ దేశ దిగ్గజాలు కుమార సంగక్కర, మహేలా జయవర్దనెే స్పందించారు. అయితే, వీరిద్దరూ భిన్న స్వరాలు వినిపించడం గమనార్హం. ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న సంగక్కర ఈ విషయంపై స్పందిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో లంక జట్టుకు కచ్చితమైన షెడ్యూల్‌ లేకపోవడమే ఆ జట్టు ఆటగాళ్లను తీసుకోకపోవడానికి ప్రధాన కారణమని చెప్పాడు.

ఇదే విషయంపై ముంబయి ఇండియన్స్‌ హెడ్‌కోచ్‌ మహేలా జయవర్దనే మాట్లాడుతూ.. "లంక ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడకపోవడం నిరాశ కలిగించిందని చెప్పాడు. కొందరు ఆటగాళ్లను తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నా.. ఫ్రాంఛైజీల అవసరాలకు తగ్గట్లు వారు లేరన్నాడు. విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసే విషయంలో తక్కువ మందిని మాత్రమే తీసుకునే వీలుందని, అందులోనూ ఫాస్ట్‌ బౌలర్లు, ఆల్‌రౌండర్లవైపే ఎక్కువగా మొగ్గు చూపారని చెప్పాడు. ఈ విభాగాల్లో లంక ఆటగాళ్లు వెనుకబడ్డార"ని జయవర్దనే స్పష్టం చేశాడు.


Next Story
Share it