వరల్డ్ కప్ ముందు శ్రీలంక జట్టుకు భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టులో కీలక ఆటగాడు గాయాలతో టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీలంక ప్రధాన బౌలర్ వనిందు హసరంగా గాయంతో చికిత్స తీసుకుంటున్నాడు. అందుకే ఆసియా కప్ కు కూడా దూరమయ్యాడు. ప్రపంచ కప్ సమయానికి కోలుకుంటాడని అందరూ భావించారు.. అయితే ఇప్పుడు శ్రీలంక జట్టు యాజమాన్యం ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. హసరంగ గాయం తీవ్రతరం కావడంతో ఈ టోర్నికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతనికి శస్త్ర చికిత్స కోసం విదేశాల నుంచి వైద్యులను సంప్రదిస్తున్నామని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.
2023 వన్డే ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టు: దసున్ షనక (సి), కుసల్ మెండిస్ (విసి), పాతుమ్ నిస్సాంక, కుసల్ జనిత్ పెరెరా, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, దనంజయ డి సిల్వా, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీష పతిరన, లహిరు కుమార.
ఫిట్‌నెస్ సమస్యలు ఉన్న ఆటగాళ్లు: వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ & దిల్షన్ మధుశంక
ట్రావెలింగ్ రిజర్వ్స్: దుషన్ హేమంత, చమిక కరుణరత్నే