సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2023 సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌ను దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఎడెన్ మార్‌క్రమ్ నడిపించనున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా కొద్ది సేపటి క్రితం తెలియజేసింది.
కాగా.. ఎస్ఆర్‌హెచ్ జట్టుకు విదేశీ ఆటగాళ్లు కెప్టెన్‌గా వ్యవహరించడం కొత్తేమీ కాదు. గతంలో కొన్నేళ్ల పాటు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ సారథ్యం వహించాడు. అతడి సారథ్యంలో ఓ సారి కప్‌ను అందుకుంది. ఆ తరువాత కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించాడు. వార్నర్ గత సీజన్‌లోనే జట్టును వీడగా, ఈ సీజన్‌కు ముందు విలిమమ్ సన్ ను యాజమాన్యం విడిచిపెట్టింది. ఈ నేపథ్యంలో తదుపరి కెప్టెన్ ఎవరు అనే చర్చ మొదలైంది.
మయాంక్ అగర్వాల్‌ను వేలంలో సొంతం చేసుకోవడంతో అతడికే జట్టు పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే.. చివరకు మార్‌క్రమ్‌కు ఆ అవకాశం దక్కింది. ఇందుకు ప్రధాన కారణం ఇటీవల దక్షిణాఫ్రికా టీ20 ప్రాంఛైజీ క్రికెట్ టోర్నీ(ఎస్ఏ20)లో సన్‌రైజర్స్ యాజమాన్యానికి చెందిన అనుబంధ ప్రాంచైజీ సన్ రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌ను మార్‌క్రమ్ విజేతగా నిలిపాడు.
దీంతో ఐపీఎల్‌లో మరోసారి టైటిల్ అందుకోవాలని ఆశిస్తున్న సన్‌రైజర్స్.. మార్క్‌క్రమ్ ఇందుకు సరైనోడని బావించింది. మరీ ఆ జట్టు ఆశలను మార్‌క్రమ్ నెరవేరుస్తాడో లేదో చూడాలి మరీ