ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్‌కు భారీ షాక్
SRH captain Kane Williamson fined Rs 12 lakh for slow over rate against RR.ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు
By తోట వంశీ కుమార్ Published on 30 March 2022 2:09 PM ISTఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ (నిర్ణీత సమయానికి ఓవర్ల కోటా పూర్తి చేయనుందుకు) గాను భారీ జరిమానా విధించారు. కెప్టెన్ కేన్ విలియమ్ సన్‌కు రూ.12 లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఓప్రకటనలో తెలిపారు. ఈ సీజన్‌లో తొలిసారి ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు తప్పు చేసిందని, ఐపీఎల్ నియమావళి ప్రకారం కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌పై 12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
'రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందున సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు జరిమానా విధిస్తున్నాం. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం స్లో ఓవర్ రేటు విషయంలో ఈ సీజన్‌లో ఇది జట్టు మొదటి తప్పు . సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నాం' అని ఆ ప్రకటనలో తెలిపింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' కెప్టెన్ సంజూ శాంసన్ (27 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్థశతకంతో చెలరేగా.. దేవదత్ పడిక్కల్ (29 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హెట్‌మైర్ (13 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సమయోచితంగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో రాయల్స్ భారీ స్కోర్ సాధించింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులే పరిమితమైంది. దీంతో 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.