భారతజట్టు అక్కడికి వెళితే ఫైరింగ్ జరగదని ఎవరు గ్యారెంటీ..?

Spin Great On Whether India Should Go To Pakistan For Asia Cup. 2023 ఆసియా కప్ ఎక్కడ జరుగుతుంది? అన్నది ఆసియా క్రికెట్ వర్గాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న ప్రశ్

By Medi Samrat  Published on  27 Feb 2023 1:00 PM GMT
భారతజట్టు అక్కడికి వెళితే ఫైరింగ్ జరగదని ఎవరు గ్యారెంటీ..?

2023 ఆసియా కప్ ఎక్కడ జరుగుతుంది? అన్నది ఆసియా క్రికెట్ వర్గాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. ఆసియా కప్‌ను మొదట పాకిస్తాన్‌ లోనే నిర్వహించాలని భావించి ఆ దేశానికి కేటాయించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో టోర్నమెంట్ నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) చైర్మన్ కూడా అయిన బీసీసీఐ సెక్రటరీ జే షా గత అక్టోబర్‌లో భారతదేశం పాక్ కు వెళ్లడం లేదని ప్రకటించారు. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఒక ప్రకటనలో భారతదేశం ఆసియా కప్‌కు వెళ్లకపోతే, 2023 వన్డే ప్రపంచ కప్‌కు భారత్ కు రామని తెలిపింది. అప్పటి నుంచి పలు సమావేశాలు జరుగుతున్నా స్పష్టమైన పరిష్కారం లభించలేదు. ఈ విషయంపై భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

"బీసీసీఐ నిర్ణయం సరైనదేనని నేను అనుకుంటున్నాను. మేము మా జట్టును పాకిస్తాన్‌కు పంపకూడదు. ఇటీవల కూడా కరాచీ స్టేడియం పక్కనే కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియని ప్రదేశానికి మీ జట్టును పంపడం కరెక్ట్ కాదు. ఆటగాళ్లకు భద్రతా సమస్యగా ఉండే ఏదైనా స్థలాన్ని కూడా టోర్నమెంట్ కు సరైన ప్రాంతంగా పరిగణించకూడదు." అని హర్భజన్ సింగ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.

వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం, ఆసియా కప్ విషయంలో సాధ్యమయ్యే పరిష్కారం ఏమిటంటే.. టోర్నమెంట్ కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వవచ్చు. అయితే కొన్ని మ్యాచ్ లను UAEలో నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా భారత్ కు సంబంధించిన మ్యాచ్‌లను అక్కడే ఆడించాలని పాకిస్థాన్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. భారతదేశం ఫైనల్ కు అర్హత సాధిస్తే యుఏఈ లో ఫైనల్‌ జరపాల్సి ఉంటుంది.


Next Story