ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో స్పైడర్ కెమెరా ప్రొటీస్ బౌలర్ అన్‌రిచ్ నోర్ట్జే ను కింద పడిపోయేలా చేసింది. మెల్‌బోర్న్ వేదికగా తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సమయంలో ఇది చోటుచేసుకుంది. రెండో సెషన్‌లో ఓవర్ ముగిశాక బ్రేక్ సమయంలో ఒక స్పైడర్ కెమెరా నోర్ట్జే వైపు దూసుకొచ్చింది. వెనుక వైపు నిలబడిన నోర్ట్జే ఇది గమనించలేదు. వేగంగా వచ్చిన కెమెరా అతన్ని తలను బలంగా ఢీకొట్టింది. కెమెరా దెబ్బకు గ్రౌండ్‌పై పడిపోయిన నోర్ట్జే తిరిగి పైకి లేచాడు. అయితే ఇది గమనించిన ఆటగాళ్లు దగ్గరకు వెళ్లి చూశారు.. ఏమీ అవ్వలేదనే విషయం తెలుసుకుని అంపైర్లు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టు సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 48 బ్యాటింగ్, అలెక్స్ కేరీ 9 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. సీనియర్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ చేశాడు. స్టీవ్ స్మిత్ 85 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసీస్ 197 పరుగుల ఆధిక్యంలో ఉంది.