భువనేశ్వర్ కుమార్ 208 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేశాడా..?

Speedometer shows Bhuvneshwar bowl a 208 kph delivery against Ireland. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు

By Medi Samrat  Published on  27 Jun 2022 7:39 AM GMT
భువనేశ్వర్ కుమార్ 208 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేశాడా..?

రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు వరుణుడు తొలుత ఆటంకం కలిగించాడు. భారత కాలమానం ప్రకారం గత రాత్రి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా 2.20 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. హెర్రీ టెక్టార్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేయగా, వికెట్ కీపర్ టకర్ 16 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా, అవేష్ ఖాన్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. 109 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 9.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ దీపక్ హుడా 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు (నాటౌట్) చేయగా, ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ 2, జోషువా లిటిల్ ఒక వికెట్ తీసుకున్నారు. యుజ్వేంద్ర చాహల్‌కు 'ప్లేయర్ ఆప్ ద మ్యాచ్' అవార్డు లభించింది.

ఈ మ్యాచ్ టెలీకాస్ట్ అవుతున్నప్పుడు ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భువనేశ్వర్ కుమార్ వేసిన బంతి ఏకంగా 208 కిలోమీటర్ల వేగంతో వెళ్లిందని చూపించింది. ఈ మ్యాచ్ లో భువనేశ్వర్‌ కుమార్‌ మంచి బౌలింగ్ వేశాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడానికి పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్నాడు. అతను ఐర్లాండ్ సారథి ఆండ్రూ బల్బిర్నీని ఇన్‌స్వింగర్‌తో అవుట్ చేయగా.. ఒక మెయిడిన్‌తో సహా 1/16 తో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. స్పీడోమీటర్ లో రెండు సందర్భాలలో భువనేశ్వర్ 200kph-ప్లస్ స్పీడ్‌తో బౌలింగ్ చేశాడని చూపించడం అభిమానులను షాక్ కు గురి చేసింది. భువనేశ్వర్ మ్యాచ్ లో మొదటి డెలివరీ గంటకు 201 కి.మీ.తో వెళ్లిందని స్పీడో మీటర్ చూపించగా.. అదే ఓవర్‌లో మరో బంతి స్పీడోమీటర్ గంటకు 208 కిమీ వేగంతో వేసినట్లు చూపించారు. సాంకేతిక లోపం కారణంగా చాలా మంది అభిమానులు ట్వీట్ చేశారు. ప్రపంచ క్రికెట్‌లో 161.3 కి.మీ వేగంతో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన రికార్డును సొంతం చేసుకున్న షోయబ్ అక్తర్‌ను కూడా సోషల్ మీడియాలో పలువురు తలచుకున్నారు.












Next Story