'మై లిటిల్ రాక్‌స్టార్.. నీ ఆత్మక శాంతి చేకూరాలి' : క్రికెటర్ భావోద్వేగ పోస్ట్
South African cricketer David Miller's daughter passes away.డేవిడ్ మిల్లర్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టును చేశాడు.
By తోట వంశీ కుమార్ Published on
9 Oct 2022 2:21 AM GMT

దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టును చేశాడు. ఓ చిన్నారి క్యాన్సర్‌తో పోరాడుతూ తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని డేవిడ్ మిల్లర్ తెలియజేశాడు. ''మై లిటిల్ రాక్‌స్టార్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా'' అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
'మై లిటిల్ రాక్ స్టార్' అని సంబోధించినప్పటికీ ఎక్కడా తన కుమార్తె అని పేర్కొనలేదు. మీడియా సంస్థల్లో అత్యధికం చనిపోయిన చిన్నారి మిల్లర్ కూతురుగానే చెబుతుండగా.. మరికొందరు మాత్రం అతడికి బాగా దగ్గరైన అభిమాని అంటున్నారు. కాగా.. మిల్లర్ తమ మధ్య బంధాన్ని వెల్లడించకపోవడంతో ఆ చిన్నారి ఎవరన్నది తెలియరాలేదు.
భారత్, దక్షిణాఫ్రికాతో మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో మిల్లర్ ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నాడు. నేడు ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఇప్పటికే సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక సిరీస్‌లో నిలబడాలంటే ఈ మ్యాచ్ టీమ్ఇండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. కాగా.. మిల్లర్ పోస్టుతో సౌతాఫ్రికా జట్టులో విషాద ఛాయలు అలముకున్నాయి.
Next Story