హమ్మయ్య.. దక్షిణాఫ్రికా గెలిచింది..!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సాగిన టీ20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచింది.

By -  Medi Samrat
Published on : 26 Feb 2026 6:30 PM IST

హమ్మయ్య.. దక్షిణాఫ్రికా గెలిచింది..!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సాగిన టీ20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచింది. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్స్ కు వెళ్లే అవకాశాలు మెరుగుపడ్డాయి. 9 వికెట్ల తేడాతో సఫారీలు విజయాన్ని అందుకున్నారు. మార్క్రమ్ 82 పరుగులతో రాణించాడు. డికాక్ 47 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన రాన్ రికల్టన్ 28 బంతుల్లో 45 పరుగులు బాది దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సెమీస్ లో అడుగుపెట్టింది.

టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో విండీస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు ఆరంభంలో అద్భుతంగా రాణించారు. లుంగి ఎంగిడి 30 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టగా, కగిసో రబాడ పొదుపుగా బౌలింగ్ చేసి 22 పరుగులకే 2 వికెట్లు తీశాడు. కార్బిన్ బాష్ కూడా రెండు వికెట్లతో రాణించాడు. వీరి ధాటికి వెస్టిండీస్ ఒక దశలో 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. , ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్ (31 బంతుల్లో 49), రొమారియో షెపర్డ్ (37 బంతుల్లో 52 నాటౌట్) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 89 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.

Next Story