టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. ప్రస్తుతం 70/3
South Africa wins toss and bats in 1st ODI against India.మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పార్ల్ వేదికగా భారత్,
By తోట వంశీ కుమార్ Published on 19 Jan 2022 10:01 AM GMTమూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పార్ల్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడంతో టీమ్ఇండియాకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక అందరూ ఊహించినట్లే ఐపీఎల్ సంచలనం వెంకటేశ్ అయ్యర్‌కు ఈ మ్యాచ్ ద్వారా అరంగ్రేటం చేస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓ పేస్ ఆల్‌రౌండర్‌తో పాటు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతోంది. యుజ్వేంద్ర చాహల్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కింది. చాలా రోజుల తర్వాత అశ్విన్ మళ్లీ వన్డే క్రికెట్ ఆడుతున్నాడు. ఊహించినట్లుగానే ఓపెనర్‌గా శిఖర్ ధావన్‌కు చోటు దక్కగా.. మిడిలార్డర్‌లో మాత్రం సూర్యకుమార్ యాదవ్‌కు బదులు శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇచ్చారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు బుమ్రా ఐదో ఓవర్‌లో షాకిచ్చాడు. 6 పరుగులు చేసిన ఓపెనర్ జానెమన్ మలాన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో సౌతాఫ్రికా 19 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు పరుగులు తీసేందుకు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం 18 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా స్కోర్ 70/3. కెప్టెన్ బవుమా 25, డసెన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్, యుజ్వేంద్ర చాహల్
దక్షిణాఫ్రికా జట్టు : బవుమా (కెప్టెన్), డికాక్, జె.మలాన్, మర్‌క్రమ్, డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెలుక్వాయో, జాన్సన్, కేశవ్ మహారాజ్, షాంసీ, ఎంగిడి