వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌కు వర్షం ముప్పు.. టాస్ ఎవరిదంటే?

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా టాస్ గెలిచాడు.

By Medi Samrat
Published on : 11 Jun 2025 2:45 PM IST

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌కు వర్షం ముప్పు.. టాస్ ఎవరిదంటే?

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా టాస్ గెలిచాడు. టాస్ గెలిచి ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. లార్డ్స్‌లో వాతావరణం మేఘావృతమై ఉండటంతో పేసర్లకు పిచ్ నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. మొదటి రోజు వీలైనన్ని వికెట్లు తీయాలని, కుదిరితే ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది.

ఆస్ట్రేలియా: 1 ఉస్మాన్ ఖవాజా, 2 మార్నస్ లాబుషాగ్నే, 3 కామెరాన్ గ్రీన్, 4 స్టీవెన్ స్మిత్, 5 ట్రావిస్ హెడ్, 6 బ్యూ వెబ్‌స్టర్, 7 అలెక్స్ కారీ, 8 పాట్ కమిన్స్ (కెప్టెన్), 9 మిచెల్ స్టార్క్, 10 నాథన్ లియాన్, 11 జోష్ హాజిల్‌వుడ్

దక్షిణాఫ్రికా: 1 ఐడెన్ మార్క్‌రామ్, 2 ర్యాన్ రికిల్‌టన్, 3 వియాన్ ముల్డర్, 4 టెంబా బావుమా (కెప్టెన్), 5 ట్రిస్టన్ స్టబ్స్, 6 డేవిడ్ బెడింగ్‌హామ్, 7 కైల్ వెర్రెయిన్, 8 మార్కో జాన్‌సెన్, 9 కేశవ్ మహరాజ్, 10 కగిసో రబాడా, 11 లుంగి ఎంగిడి

Next Story