సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ విజయం.. సిరీస్ సమం
సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన ముగిసింది. చివరి టెస్టు మ్యాచ్‌లో విజయంతో ఈ టూర్‌ను ముగించింది భారత్.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 6:07 PM ISTసౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ విజయం.. సిరీస్ సమం
సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన ముగిసింది. చివరి టెస్టు మ్యాచ్‌లో విజయంతో ఈ టూర్‌ను ముగించింది భారత్. సౌతాఫ్రికా టూర్‌లో భాగంగా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అవ్వగా.. వన్డే సరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. తాజాగా రెండు టెస్టు మ్యాచ్‌ల సరీస్‌ను 1-1తో సమం చేసింది. రెండో టెస్టులో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా 153 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా దక్షిణాఫ్రికాను భారత్ 176 పరుగులకు ఆలౌట్ చేసింది. ఒక మర్క్రమ్ తప్ప ఎవరూ రాణించలేదు. 103 బంతుల్లో మర్క్రమ్ 106 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను 79 పరుగుల లక్ష్యంతో మొదలుపెట్టింది. 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరును ఛేదించింది.
రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 23 బంతుల్లో 28 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా 22 బంతుల్లో 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ (12), శుభ్‌మన్ గిల్ (10), శ్రేయస్ అయ్యర్ (4*) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, నండ్రీ బర్గర్, మార్కో జాన్సన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెస్టు కెరీయర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని డీన్ ఎల్గర్ అనుకున్నాడు. కానీ అతనికి చివరి టెస్టు మ్యాచ్‌లో నిరాశే ఎదురైంది. బ్యాటింగ్‌లో కూడా ఎల్గర్ విఫలం అయ్యాడు. చివరి టెస్టు ఆడిన సందర్భంగా డీన్ ఎల్గర్‌కు అభినందనలు తెలిపారు టీమిండియా ఆటగాళ్లు.
కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాప్రికాను మహ్మద్ సిరాజ్ బెంబేలెత్తించాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ ధాటికి దక్షిణాఫ్రికా తొలి సెషన్‌లోనే 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. 1991లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు అత్యల్ప స్కోరు ఇదే. ఒక రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా అదరగొట్టాడు. అతను కూడా ఆరు వికెట్లు తీసి సౌతాఫ్రికా ఆటగాళ్లను వరుసగా పెవిలియన్‌కు చేర్చాడు. మొత్తంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో సమం అయ్యింది.