భారత్‌తో టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును దక్షిణాఫ్రికా మంగళవారం ప్రకటించింది. ఈ సిరీస్‌కు టెంబ బావుమా సారథ్యం వహించనున్నాడు. ఇరు జట్ల మధ్య జూన్ 9 నుంచి 5 మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ ఈ సిరీస్ ద్వారా దక్షిణాఫ్రికా తరుపున టీ20ల్లో అరంగ్రేటం చేయనున్నాడు. చాలా కాలం తరువాత సీనియర్ పేసర్ వేన్ పార్నెల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గాయం కారణంగా గత మ్యాచులకు దూరంగా ఉన్న అన్రీచ్ నోర్జే కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక ఐపీఎల్‌లో ఆడుతున్న చాలా మంది ఆటగాళ్లను భారత్ తో సిరీస్ కోసం ఎంపిక చేసింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.