టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. 7 పరుగులు మాత్ర‌మే ఇచ్చి..

పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భూటాన్‌కు చెందిన సోనమ్ యేషే ఒక ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

By -  Medi Samrat
Published on : 26 Dec 2025 9:20 PM IST

టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. 7 పరుగులు మాత్ర‌మే ఇచ్చి..

పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భూటాన్‌కు చెందిన సోనమ్ యేషే ఒక ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. త‌ద్వారా ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా నిలిచాడు. డిసెంబర్ 26, 2025న మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు.

మయన్మార్, భూటాన్ మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో సోనమ్ ఈ చారిత్రాత్మక ప్రదర్శన చేశాడు. భూటాన్‌లోని గెలెఫు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మూడో T20I మ్యాచ్‌లో.. భూటాన్ విజిటింగ్ టీమ్‌ను ఓడించి సిరీస్‌లో 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.

లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ సోనమ్ యేషే నాలుగు ఓవర్లలో 1 మెయిడెన్‌తో 7 పరుగులిచ్చి మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. మ‌రో ఆనంద్ మోంగర్ రెండు వికెట్లు తీశాడు. టీ20లో ఒక ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా సోనమ్‌ రికార్డు సృష్టించాడు. ఈ క్ర‌మంలో సోనమ్ మలేషియాకు చెందిన సయాజ్రుల్ ఇద్రాస్ రికార్డును బద్దలు కొట్టాడు.

టీ20లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..

సోనమ్ యేషే (భూటాన్)- 8

సయాజ్రుల్ ఇద్రాస్ (మలేషియా)-7

అలీ దావూద్ (బహ్రెయిన్)- 7

హర్ష్ భరద్వాజ్ (సింగపూర్)- 6

పి అహో (నైజీరియా)- 6

దీపక్ చాహర్ (భారతదేశం)- 4

టాస్ గెలిచిన మయన్మార్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భూటాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఛేద‌న‌కు దిగిన మయన్మార్ జట్టు సోనమ్ ధాటికి 9.2 ఓవర్లలో 45 పరుగులకే పరిమితమైంది.

Next Story