చరిత్ర సృష్టించిన స్మృతి మందనా..రెండో ప్లేయర్‎గా అరుదైన రికార్డ్

ఇండియన్ మహిళా క్రికెట్ హిస్టరీలో స్మృతి మందనా రికార్డు సృష్టించారు.

By -  Knakam Karthik
Published on : 28 Dec 2025 8:28 PM IST

Sports News, Smriti Mandhana, Cricket,  international runs

చరిత్ర సృష్టించిన స్మృతి మందనా..రెండో ప్లేయర్‎గా అరుదైన రికార్డ్

ఇండియన్ మహిళా క్రికెట్ హిస్టరీలో స్మృతి మందనా రికార్డు సృష్టించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఇండియన్ క్రికెటర్‌గా, ఓవర్‌లగా నాలుగో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించారు. అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్స్ జాబితాలో స్మృతి మంధాన కంటే ముందు మిథాలీ రాజ్ 10,868 ఉన్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు

మిథాలీ రాజ్ (IND-W): 333 మ్యాచ్‌లు, 10,868 పరుగులు

సుజీ బేట్స్ (NZ-W): 355 మ్యాచ్‌లు, 10,652 పరుగులు

షార్లెట్ ఎడ్వర్డ్స్ (ENG-W): 309 మ్యాచ్‌లు, 10,273 పరుగులు

స్మృతి మంధాన (IND-W): 281 మ్యాచ్‌లు, 10,000 పరుగులు

నాట్ స్కైవర్-బ్రంట్ (ENG-W): 278 మ్యాచ్‌లు, 8,197 పరుగులు

హర్మన్‌ప్రీత్ కౌర్ (IND-W): 346 మ్యాచ్‌లు, 8,088 పరుగులు

మెగ్ లానింగ్ (AUS-W): 235 మ్యాచ్‌లు, 8,007 పరుగులు

స్మృతి మంధాన..కెరీర్ నంబర్లు

మహిళల టెస్టుల్లో, మంధాన 7 మ్యాచ్‌లు ఆడి, 12 ఇన్నింగ్స్‌లలో 57.18 సగటుతో 629 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 149. ఆమె ఖాతాలో 2 సెంచరీలు మరియు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మహిళల వన్డేల్లో, ఆమె 117 మ్యాచ్‌ల్లో ఆడింది, 117 ఇన్నింగ్స్‌లలో 48.38 సగటుతో 5,322 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్‌లో ఆమె అత్యధిక స్కోరు 136, మరియు ఆమె 14 సెంచరీలు మరియు 34 అర్ధ సెంచరీలు చేసింది. మహిళల T20I లలో, భారత వైస్-కెప్టెన్ 157 మ్యాచ్‌లు ఆడి 112 అత్యధిక స్కోరును సాధించింది. ఆమె రికార్డులో ఒక సెంచరీ మరియు 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Next Story