చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..!
ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లో స్మృతి మంధాన ప్రపంచ రికార్డు సృష్టించింది.
By - Medi Samrat |
ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లో స్మృతి మంధాన ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 వన్డే పరుగులు చేసిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. మహిళల వన్డేలో అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రీడాకారిణిగా కూడా నిలిచింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో మంధాన ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా బ్యాట్స్‌మెన్ రికార్డును బద్దలు కొట్టింది. 29 ఏళ్ల మంధాన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో అయాబొంగా ఖాకా వేసిన బంతిని సిక్సర్‌గా మలిచి బెలిండా క్లార్క్ 1997లో నెలకొల్పిన 970 పరుగుల రికార్డును అధిగమించింది. అదే సమయంలో 62 పరుగులు చేసి మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది.
స్మృతి మంధాన మహిళల వన్డే క్రికెట్‌లో 5,000 పరుగులు చేసిన ఐదవ, రెండవ భారత మహిళా క్రీడాకారిణి. మంధాన ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలు. 112 ఇన్నింగ్సులలో బంతులు (5568) పరంగా వేగంగా ఐదు వేల పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె స్టాఫానీ టేలర్ (129 ఇన్నింగ్స్‌లు), సుజీ బేట్స్ (6182 బంతుల్లో)ల రికార్డులు బ్రేక్ చేసింది.
మిథాలీ రాజ్ తర్వాత వన్డే క్రికెట్‌లో ఐదు వేల పరుగులు చేసిన రెండో భారత క్రీడాకారిణిగా మంధాన నిలిచింది. అయితే ఈ ప్రపంచకప్‌లో మంధాన ఆటతీరు బాగాలేదు. శ్రీలంకపై 8, పాకిస్థాన్‌పై 23, దక్షిణాఫ్రికాపై 23 పరుగులు మాత్రమే చేసింది.