ప్రపంచ ఛాంపియన్ ను షాక్ అయ్యేలా చేసిన 16 ఏళ్ల భారతీయ గ్రాండ్‌మాస్టర్

Sixteen-year-old Praggnanandhaa stuns World No.1 Magnus Carlsen. 16 ఏళ్ల భారతీయ గ్రాండ్‌మాస్టర్ R ప్రగ్నానంద ఆన్‌లైన్ రాపిడ్ చెస్ పోటీ అయిన ఎయిర్‌థింగ్స్

By Medi Samrat  Published on  21 Feb 2022 9:45 AM GMT
ప్రపంచ ఛాంపియన్ ను షాక్ అయ్యేలా చేసిన 16 ఏళ్ల భారతీయ గ్రాండ్‌మాస్టర్

16 ఏళ్ల భారతీయ గ్రాండ్‌మాస్టర్ R ప్రగ్నానంద ఆన్‌లైన్ రాపిడ్ చెస్ పోటీ అయిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఎనిమిదో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్, మాగ్నస్ కార్ల్‌సెన్‌ కు షాక్ ఇచ్చాడు. మెల్ట్‌వాటర్ ఛాంపియన్స్ చెస్ టూర్‌లో మాగ్నస్ కార్ల్‌సెన్‌ ను ఓడించాడు. టీనేజ్ ఇండియన్ చెస్ సంచలనం R ప్రగ్నానంద బ్లాక్ పాన్స్ తో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన GM మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించడంతో మొత్తాన్ని విస్మయానికి గురి చేశాడు.

ఫీల్డ్‌లోని అతి పిన్న వయస్కుడైన ఆటగాడు, ప్రగ్నానంద ఎనిమిదో రౌండ్‌లో కార్ల్‌సెన్‌తో తలపడడానికి ముందు ఈ టోర్నమెంట్ లో కఠినమైన సమయాన్ని గడిపాడు. 16 ఏళ్ల ప్రగ్నానంద అర్మేనియన్ GM లెవాన్ అరోనియన్‌పై మాత్రమే గెలిచాడు, రెండు డ్రా చేసి తన మిగిలిన అన్ని గేమ్‌లను కోల్పోయాడు. కార్ల్‌సెన్‌ తో మ్యాచ్ లో మాత్రం ప్రజ్ఞానానంద దూకుడుగా ఆడాడు. బ్లాక్ పావులతో తమిళనాడు కుర్రాడు మిడిల్ గేమ్‌లో మంచి స్థానాన్ని సంపాదించాడు. ఆఖర్లో తన రాణి, గుర్రంతో అద్భుతమైన గేమ్ ఆడి విజయాన్ని అందుకున్నాడు. కార్ల్‌సెన్ టోర్నమెంట్ లో వరుసగా మూడు విజయాలను సాధించాడు.


Next Story