మళ్లీ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న సిరాజ్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు మహమ్మద్ సిరాజ్ ఎనిమిది స్థానాలు
By Medi Samrat Published on 20 Sep 2023 3:45 PM GMTఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు మహమ్మద్ సిరాజ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి ఏకంగా మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై ఆరు వికెట్లు తీసిన సిరాజ్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య నెంబర్ వన్ స్థానానికి చేరాడు. ఇప్పుడు మరోసారి ఈ స్థానానికి చేరుకున్నాడు. సిరాజ్ తర్వాత హేజిల్ వుడ్, ట్రెండ్ బౌల్డ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆప్ఘనిస్థాన్ ఆటగాళ్లు ముజీబుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. టీమిండియా ఆటగాడు కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు దిగజారి 9వ స్థానానికి పరిమితమయ్యాడు. బుమ్రా రెండు స్థానాలు ఎగబాకి 27వ స్థానంలోకి వచ్చాడు.
బ్యాట్స్‌మెన్ లలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శుభ్‌మన్ గిల్, కోహ్లీ, రోహిత్ శర్మలు రెండు, ఎనిమిది, పదో స్థానాల్లో ఉన్నారు. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు సిరాజ్.. ఒకే ఓవర్లో 4 వికెట్లు కూల్చిన సిరాజ్ శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర వహించాడు. ఆసియా కప్‌లో 12.2 యావరేజ్‌తో 10 వికెట్లు పడగొట్టాడు సిరాజ్. ప్రపంచ కప్ ముందు సిరాజ్ అద్భుతమైన ఫామ్ లో కనిపించడం భారత జట్టుకు ప్లస్ గా మారనుంది.